సంక్రాంతి మెగా కోడి పుంజు అన్నట్లు రెడీ అవుతోంది వాల్తేర్ వీరయ్య. ఇటు మెగాస్టార్ చిరు, అటు మాస్ హీరో రవితేజ..ఫన్ విత్ పంచ్ అనేలా డైలాగులు..ఫైట్లు..డ్యూయట్లు..అన్నీ పక్కా ప్యాకేజ్ అన్నట్లు తయారవుతోంది. సినిమా మొత్తం ఇలాగే వుంటుంది అనేలా ట్రయిలర్ ను వదిలారు. ట్రయిలర్ మొత్తం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా వుంది.
బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ని చూసే.. మీరు వ్యూ లో లేకపోతే బెస్ట్ వ్యూ ఎలా అవుతుంది..ఇలా ఒకటి కాదు చాలా డైలాగులు పడ్డాయి ట్రయిలర్ లో. పనిలో పనిగా పూరి జగన్నాధ్ పాపులర్ డైలాగులు…’వీరయ్య లోకల్’ కూడా వుంది ట్రయిలర్ లో.
సినిమాలో కథేంటీ అన్నది హిట్ ఇవ్వలేదు కానీ, ‘నా కథలోకి మిమ్మల్ని లాక్కు వచ్చా’ అని చెప్పడం ద్వారా రివెంజ్ స్టోరీ అని అర్థం అవుతోంది. కథ మీద కన్నా వింటేజ్ చిరంజీవి ని, వింటేజ్ మెగా మూవీస్ ను గుర్తు చేయడం అన్న, మరోసారి అదే స్టయిల్ సినిమాను చూపించడం అనే టార్గెట్ తో సినిమాను రెడీ చేసినట్లు కనిపిస్తోంది.
దర్శకుడు బాబీ ఈ విషయంలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. దేవీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఓకె. సినిమాకు మైత్రీ మూవీస్ భారీగా ఖర్చు చేసినట్లు ట్రయిలర్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.