ఓల్డ్ టైగర్ రీ యాక్టివ్

రామోజీ రావు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. మొండితనంలో మేటి, వ్యాపార నిర్వహణలో ఘనాపాఠి. అలాంటి 83 ఏళ్ల ఓల్డ్ టైగర్ గత కొంతకాలంగా కాస్త లీజర్ గా వుంది. వ్యాపారాలు అన్ని…

రామోజీ రావు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. మొండితనంలో మేటి, వ్యాపార నిర్వహణలో ఘనాపాఠి. అలాంటి 83 ఏళ్ల ఓల్డ్ టైగర్ గత కొంతకాలంగా కాస్త లీజర్ గా వుంది. వ్యాపారాలు అన్ని కొడుకు, కోడళ్లకు అప్పగించి, తాను జస్ట్ కీలకమైన నిర్ణయాలకు, ఫైనల్ డెసిషన్లకు పరిమితమై, కాస్త విశ్రాంతిగా వున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో కరోనా కలకలం మొదలై, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కకావికలు చేసే పరిస్థితి కనిపించింది. భారీ నిర్వహణ అవసరమైన రామోజీ ఫిలిం సిటీ ఓడుదుడుకుల్లో పడింది. ఆయనకు అత్యంత ప్రియమైన ఈనాడు గ్రూపు ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. అనేకానేక కారణాల వల్ల ఈనాడు సర్క్యులేషన్ ను తగ్గించుకోవాల్సి వచ్చింది.

మళ్లీ షూటింగ్ లు ప్రారంభమైతే ఫిలిం సిటీకి తిరుగువుండదు. బాలీవుడ్ నుంచి విపరీతమైన డిమాండ్ వుంది. కానీ ఈ లోగా నిర్వహణ, కరోనా అనంతరం తీసుకోవాల్సిన అన్ని రకాల కీలక నిర్ణయాలు వుండనే వున్నాయి. అలాగే ఈనాడును మళ్లీ ట్రాక్ మీదకు తీసుకురావాల్సి వుంది. 

ఇలాంటి నేపథ్యంలో రామోజీరావు మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా పైపైన కాకుండా, రెగ్యులర్ గా మార్నింగ్ టు ఈవెనింగ్ అన్ని రకాల పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఈనాడు మార్కెట్ ను మళ్లీ ఎలా పెంచుకోవాలి. అలాగే ఈ పేపర్ ను పెయిడ్ సబ్ స్క్రిప్షన్ కింద ఎలా మార్చాలి. ఇలాంటి కీలక నిర్ణయాలన్నింటి మీద ఆయన చాలా యాక్టివ్ గా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

డే టు డే యాక్టివిటీస్ ను మిగిలిన వారికి వదిలేసినా, కీలకమైన వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ రామోజీరావు మళ్లీ తన చేతుల్లోకి తీసుకుని, డిస్కస్ చేస్తున్నట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వయస్సులో కూడా ఆయన పట్టుదలను మెచ్చుకోవాల్సిందే.

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు