హాట్ గా ఫొటోలు దిగి వాటిని పోస్టు చేయడం విషయంలో అస్సలు తగ్గేట్టుగా లేదూ దీప్తీ భట్నాగర్. తెలుగు వాళ్లు దాదాపు మరిచిపోయిన పేరిది. అయితే ఉత్తరాది వారికి మాత్రం టెలివిజన్ షో ల ద్వారా దీప్తీ ఇంకా టచ్ లోనే ఉంది. ఈ క్రమంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం అక్కడ తను అందంగా దిగిన ఫొటోలను పోస్టు చేయడాన్ని కొనసాగిస్తూ ఉంది.
కరోనా లాక్ డౌన్ రిలాక్సేషన్ నేపథ్యంలో.. అప్పుడే సినిమా వాళ్లు ప్రయాణాలు మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో దీప్తీ గోవా నుంచి ఈ పిక్స్ ను పోస్టు చేసింది. అక్కడ బీచ్ లలో సేదతీరుతూ వీటిని తన ఫాలోయర్ల కోసం పోస్టు చేసింది.
అన్నింటికీ మించిన విశేషం ఏమిటంటే.. ఈ వయసులో కూడా దీప్తీ ఇలా కనిపిస్తూ ఉండటం! పెళ్లిసందడి సినిమానే దాదాపు పాతికేళ్లను పూర్తి చేసుకున్నట్టుగా ఉంది. ప్రస్తుతం దీప్తీ వయసు 52 సంవత్సరాలు! అయితే దీప్తీ భట్నాగర్ మాత్రం తన వయసు ఛాయలను మొహంలో అస్సలు కనిపించనీయడం లేదు! చిట్టిపొట్టి దుస్తులతో అమ్మాయిలకు పోటీనిచ్చేలా ఫొటోలను పోస్టు చేస్తూ ఉంది!