ఖుషీ…ఇన్ స్టా లైవ్

తన కొత్త సినిమా ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్…

తన కొత్త సినిమా ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి డీటెయిల్డ్ గా చెప్పారు విజయ్. ఈ లైవ్ ఇంటర్వ్యూలో ఖుషి హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఖుషి జర్నీ గురించి మాట్లాడారు.

ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మంచి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తారు. అలా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తే సెట్ లో ఇబ్బందే ఉండదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి

డైరెక్టర్ శివతో కనెక్ట్ అయ్యేందుకు నాకు ఓ నెల రోజుల టైమ్ పట్టింది. శివ నేను కనెక్ట్ అయిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా.

ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.

సమంత తెలివైన అమ్మాయి. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు, లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం.

తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.

డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా.

నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా.