సర్ప్రయిజ్-ఎన్టీఆర్ టైటిల్ మారుతోంది

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు ఓ  ప్రత్యేకత వుంది. అన్ని త్రివిక్రమ్ సినిమాల మాదిరిగా కాకుండా, సినిమా బిగిన్ కాకుండానే టైటిల్ చెప్పడం అన్నది త్రివిక్రమ్ సినిమాకు అలవాటైన విషయం కాదు.  కానీ ఈ సినిమాకు…

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు ఓ  ప్రత్యేకత వుంది. అన్ని త్రివిక్రమ్ సినిమాల మాదిరిగా కాకుండా, సినిమా బిగిన్ కాకుండానే టైటిల్ చెప్పడం అన్నది త్రివిక్రమ్ సినిమాకు అలవాటైన విషయం కాదు.  కానీ ఈ సినిమాకు మాత్రం ముందే టైటిల్ బయటకు వచ్చింది. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను నిర్మాణ సంస్థ హారిక హాసిని రిజిస్టర్ చేయించింది. 

దాంతో అది ఎన్టీఆర్ సినిమాకే అన్న విషయం ప్రచారంలోకి వచ్చేసింది. నిర్మాణ సంస్థ కూడా దీన్ని ఖండించనూ లేదు, అంగీకరించనూ లేదు. ఈ టైటిల్ ను పట్టుకుని కొంత మంది ఏకంగా కథలు కూడా అల్లేసి, ఎన్టీఆర్ పొలిటికల్ సినిమా చేస్తున్నారని, బ్రేకింగ్..ఎక్స్ క్లూజివ్ అంటా వార్తలు కూడా రాసేసారు.

కానీ విషయం ఏమిటంటే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తయారవుతున్నది ఫక్తు ఫ్యామిలీ స్టోరీనే. ఈ సినిమా విషయంలో లేటెస్ట్ సర్ప్రయిజ్ ఏమిటంటే, ఈ టైటిల్ ను మారుస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ను నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించింది..ఎన్టీఆర్ సినిమాకు అనే ఉద్దేశంతోనే. కానీ ఇప్పుడు మరి ఎందుకో వేరే టైటిల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు. 

సిరిసిరి మువ్వ నుంచి ఎస్ అక్షరం మీద దర్శకుడు కే విశ్వనాధ్ సెంటిమెంట్ పెట్టుకున్నట్లు, త్రివిక్రమ్ అ అక్షరం మీద నమ్మకం పెట్టుకున్నారు. అందువల్ల రాబోయే టైటిల్ కూడా అదే అక్షరంతో వుంటుంది. కానీ ఈసారి టైటిల్ సినిమా సగానికి వచ్చేవరకు రివీల్ కావడం కాస్త కష్టమేమో?

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు