థియేటర్ కన్నా ఓటిటి పదిలం?

మాంచి కాంబినేషన్ వున్న సినిమాలకు ఇప్పటి పరిస్థితుల్లో థియేటర్ కన్నా ఓటిటి పదిలంగా కనిపిస్తోంది. ఒక విధంగా కాదు అనేక విధాలుగా ఇదే బెటర్ అన్న అభిప్రాయం ఇప్పడు ప్రబలుతోంది. వి సినిమా ఓటిటి…

మాంచి కాంబినేషన్ వున్న సినిమాలకు ఇప్పటి పరిస్థితుల్లో థియేటర్ కన్నా ఓటిటి పదిలంగా కనిపిస్తోంది. ఒక విధంగా కాదు అనేక విధాలుగా ఇదే బెటర్ అన్న అభిప్రాయం ఇప్పడు ప్రబలుతోంది. వి సినిమా ఓటిటి కి అనౌన్స్ చేయకముందు అటు ఇటు ఊగిసలాడే అభిప్రాయం నిర్మాతల్లో వుండేది. కానీ వి సినిమా డీల్, హిందీ రైట్స్, శాటిలైట్, ఓటిటి, థియేటర్ విడుదల కు అవకాశం ఇవన్నీ కలిసి, ఏ తలకాయనొప్పి లేకుండా డబ్బులు చేసుకోవచ్చు అనే ఆలోచనకు దారి తీసింది

విడుదలకు ముందు టెన్షన్లు, బయ్యర్లు డబ్బులు కట్టడం, తగ్గించడం, థియేటర్ల నుంచి అనుకున్న రేంజ్ లో అడ్వాన్స్ లు రాకపోవడం, ఫైనాన్స్ క్లియరింగ్, తీరా అన్నీ చేసిన తరువాత కూడా జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం. టెన్షన్ ఇవన్నీ చాలా వరకు ఓటిటిలో ఎగిరిపోతాయి. అనుకున్న మొత్తం పక్కాగా చేతికి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కార్పొరేట్ వ్యవహారాలు. 

నాని, ఇంద్రగంటి, నివేథా ఇలాంటి కాంబినేషన్, నిర్మాణ  సంస్థ వాల్యూ, డైరక్టర్ ఇంద్రగంటి పేరు ఇవన్నీ కలిసి, అమెజాన్ ప్రయిమ్ కు ఎంత మంది తెలుగు సబ్ స్క్రయిబర్లు వున్నారో అందరూ కచ్చితంగా చూస్తారు. ఒక్కరు కూడా మానరు. పైగా ఆర్జీవీ సినిమాల్లా బట్టలు విప్పి చూపే వ్యవహారం కాదు కదా. సో హ్యాపీగా చూస్తారు.

ఇది కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు కొత్తగా ఒక మూడు లక్షల మంది కనుక కొత్తగా వెయ్యి రూపాయలు కట్టి సభ్యులు అయితే చాలు, అమెజాన్ కు డబ్బులు తిరిగి వెనక్కు వచ్చేసినట్లే. వి సినిమాకు వచ్చే ప్రీ రిలీజ్ బజ్, పోస్ట్ రిలీజ్ టాక్ కచ్చితంగా ఆ అడ్వాంటేజ్ ను తీసుకువస్తుంది. అలాగే ఎప్పుడైతే ఇలా పాపులర్ సినిమాలు వస్తున్నాయో అప్పుడు రెన్యూవల్స్ కు పెద్ద కష్టం వుండదు.

అందుకే ఇప్పుడు సినిమా జనాలు మరింత గట్టి దృష్టి ఓటిటి ల మీద సారిస్తున్నారు. సినిమాల ప్లానింగ్ నే ఓటిటిల తో సంప్రదించి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. బహుశా సంక్రాంతి నాటికి ఒక్క వకీల్ సాబ్ మినహా మరేదీ థియేటర్ కు మిగలకపోవచ్చు అనిపిస్తోంది. మరో ఆరు నెలల పాటు థియేటర్లకు మిగిలేది ఇక చిన్నా, చితకా సినిమాలే

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు