జ‌వాన్ తొలి రోజు వ‌సూళ్ల టార్గెట్ ఎంతంటే!

షారూక్ 'జ‌వాన్' ప‌తాక స్థాయి అంచ‌నాల‌తో విడుద‌ల కాబోతోంది. ప‌ఠాన్ సూప‌ర్ హిట్ కావ‌డంతో జ‌వాన్ పై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ హోరెత్తుతోంది.  నార్త్ తో…

షారూక్ 'జ‌వాన్' ప‌తాక స్థాయి అంచ‌నాల‌తో విడుద‌ల కాబోతోంది. ప‌ఠాన్ సూప‌ర్ హిట్ కావ‌డంతో జ‌వాన్ పై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ హోరెత్తుతోంది.  నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొని ఉంది.

ఇలాంటి నేప‌థ్యంలో ఈ సినిమా తొలి రోజు క‌లెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటుంద‌నే అంశంపై ట్రేడ్ అంచ‌నాల‌ను వెల్ల‌డిస్తోంది. జ‌వాన్ కు తొలి రోజు వ‌సూళ్లు క‌నీసం 125 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తూ ఉన్నాయి!

ప‌ఠాన్ సినిమాకు హిందీలో 57 కోట్ల రూపాయ‌ల ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ ద‌క్కాయి. జ‌వాన్ కు హిందీ బెల్ట్ లో క‌నీసం 70 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ తొలి రోజు ఓపెనింగ్స్ రావొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తూ ఉన్నాయి. ఈ సారి షారూక్ సినిమాకు సౌత్ నుంచి 20 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ తొలి రోజు వ‌సూళ్లు ద‌క్క‌వ‌చ్చని కూడా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సౌత్ ద‌ర్శ‌కుడు, హీరోయిన్, సంగీత ద‌ర్శ‌కుడు.. వెర‌సి ఈ సినిమాపై సౌత్ లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు ఇక్క‌డా ఇర‌వై కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ తొలి రోజు వ‌సూళ్లు ద‌క్క‌వ‌చ్చిన అంచ‌నా. ఇక ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్ తో క‌లిపి తొలి రోజు ఈ సినిమా 120 కోట్ల రూపాయ‌ల మార్కును అందుకుంటుంద‌ని ట్రేడ్ అంచ‌నా!

 మ‌రి తొలి రోజు వ‌సూళ్ల విష‌యంలో షారూక్ సినిమా భారీ ఫిగ‌ర్ ను న‌మోదు చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తూ ఉంది. మ‌రి అంచ‌నాల‌ను అందుకుని, ఆ త‌ర్వాత స్ట‌డీగా వ‌సూళ్లను కొన‌సాగించ‌డ‌మే షారూక్ కు అయినా అస‌లు స‌వాల్!