కె.జి.ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో ఒక భారీ చిత్రం చేద్దామని ఎప్పట్నుంచో మన హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. మన సూపర్‌స్టార్స్ అంతా అతనితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ పక్కాగా ఓకే చేయడం లేదు.
మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్… ఇలా చాలా మందిని కలిసి ప్రశాంత్ నీల్ చర్చలు జరిపాడు. ఎన్టీఆర్‌తో ఖాయమయిందని, ప్రభాస్ సినిమా పట్టాలెక్కుతోందని వార్తలు వస్తూనే వున్నాయి కానీ వాళ్లంతా వేరే ప్రాజెక్టులు ఓకే చేసుకుంటున్నారు. ఇప్పుడు సూపర్‌స్టార్స్‌లో రామ్ చరణ్ ఒక్కడే మలి చిత్రాన్ని ఇంకా ఖాయం చేసుకోలేదు.
రామ్ చరణ్‌ని కలిసి ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ఆలోచనలో ప్రశాంత్ నీల్ వున్నాడని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీస్‌లో చరణ్ మరో చిత్రం చేయాల్సి వుంది కనుక, వారితోనే ప్రశాంత్ నీల్‌కి కమిట్‌మెంట్ వుంది కనుక చరణ్ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ తెరెకక్కడానికి అవకాశముంది.
అయితే ఆర్.ఆర్.ఆర్., ఆచార్య అయిన తర్వాతే తదుపరి చిత్రం గురించి ఆలోచించాలని చరణ్ ఫిక్స్ అయినట్టు బజ్ వుంది. మరి ప్రశాంత్ నీల్ ఎదురు చూపులకు మెగా కాంపౌండ్‌లో అయినా తెర పడుతుందో లేదో చూడాలి.