సంక్రాంతికి అతనొక్కడే!

పూర్తి కాని సినిమాల షూటింగ్స్ త్వరలో మొదలు పెట్టేసి సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేసుకోవాలని నిర్మాతలు భావించినా పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. ఎవరు సెట్స్ మీదకు వెళ్లినా కరోనా కాటేస్తూ వుండడంతో, చాలా…

పూర్తి కాని సినిమాల షూటింగ్స్ త్వరలో మొదలు పెట్టేసి సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేసుకోవాలని నిర్మాతలు భావించినా పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. ఎవరు సెట్స్ మీదకు వెళ్లినా కరోనా కాటేస్తూ వుండడంతో, చాలా మంది నటులు, టెక్నీషియన్లు ఇప్పుడు షూటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు.

కొందరు మాత్రం కరోనాను ఖాతరు చేయకుండా షూటింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదేమైనా పూర్తిస్థాయిలో షూటింగ్స్ మళ్లీ మొదలయ్యేది జనవరిలోనే అని ప్రముఖ నిర్మాతలు సన్నిహితులతో చెబుతున్నారు. షూటింగ్ స్టార్ట్ అయి ఎవరికైనా కరోనా సోకితే దానికి నిర్మాతే భారం మోయాల్సి రావడంతో ఆ రిస్క్ తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు.

సంక్రాంతికి మళ్లీ థియేటర్స్ బిజినెస్ నార్మల్ అవుతుందనే అంచనాల మధ్య సంక్రాంతికి రామ్ ‘రెడ్’ మినహా మరో సినిమా ఏదీ రెడీగా వుండేట్టు లేదు. ఎందుకంటే విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. రామ్ ఒక్కడే ‘రెడ్’ని థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తానంటూ భీష్మించుకున్నాడు. ఒకవేళ నవంబర్ నాటికి షూటింగ్స్ మొదలు కాని పక్షంలో రామ్ సోలోగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తాడు. 

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది