టాలీవుడ్ లో బ్యాచులర్ హీరోల వాట్సాప్ గ్రూపు ఒకటి వుంది. ఇప్పటికే ఆ గ్రూపు నుంచి నిఖిల్, నితిన్, రానా నిష్క్రమించారు. ఇంకా చాలా మందే ఈ గ్రూపులో వున్నారు. అయితే ఈ విషయాన్నే విడియోగా చేసి ట్విట్టర్ లో వదిలాడు హీరో సాయి ధరమ్ తేజ్. దాంతో అందరూ తేజ్ కూడా పెళ్లి చేసేసుకుంటున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ లాంటి వాళ్లు ట్విట్టర్ లో కంగ్రాట్స్ కూడా చెప్పేసారు.
అయితే ఇదంతా తేజ్ లేటెస్ట్ సినిమా సోలో బతుకే సో బెటరు ప్రమోషన్లలో భాగం అని తెలుస్తోంది. దానికి దీనికీ లింకేంటీ అంటే ఆ సినిమాలో కూడా ఇదే పాయింట్ కీలకం. అంటే సోలోగానే బతకాలని ప్రమాణం చేసి, ఓ క్లబ్ లాంటి గ్రూపు పెట్టుకోవడం, అందులోంచి ఒక్కొక్కరు తప్పుకోవడం అన్నమాట.
ఆఖరికి ఆ గ్రూపులోనే మెంబర్లుగా వున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం అన్నది చమక్కు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. మరో పాట విడుదల చేయబోతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్లకు బదులుగా జి 5 లో విడుదల చేయబోతున్నట్లు బోగట్టా.