సూపర్‌స్టార్స్‌కి పైన లెవెల్లో ప్రభాస్

సూపర్‌స్టార్ అంటేనే టాప్ లెవెల్ అని అర్థం. అయితే ప్రభాస్ ఇప్పుడు మన మిగతా సూపర్‌స్టార్స్‌కి అందని వేరే లెవెల్లో వున్నాడు. బాహుబలి తర్వాత సాెకి కూడా పాన్ ఇండియా క్రేజ్ లభిస్తే అది…

సూపర్‌స్టార్ అంటేనే టాప్ లెవెల్ అని అర్థం. అయితే ప్రభాస్ ఇప్పుడు మన మిగతా సూపర్‌స్టార్స్‌కి అందని వేరే లెవెల్లో వున్నాడు. బాహుబలి తర్వాత సాెకి కూడా పాన్ ఇండియా క్రేజ్ లభిస్తే అది ఒక్క సినిమా వరేకలే అన్నవాళ్లు వున్నారు. కానీ బాహుబలి తెచ్చిన ఇమేజ్‌ని వృధా చేసుకునేందుకు ప్రభాస్ ఏమాత్రం ఇష్టపడడం లేదు.

అందుకే తన ప్రతి సినిమాను పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సో అండ్ సో దర్శకుడితో మాత్రమే చేయాలంటూ ప్రభాస్ కమిట్‌మెంట్స్ పెట్టుకోవడం లేదు. తన ఇమేజ్‌కి న్యాయం చేయడంతో పాటు యూనివర్సల్ అప్పీల్ వున్న సినిమాలను రూపొందించే సత్తా వుందనిపించిన దర్శకులకు ప్రభాస్ ఛాన్స్ ఇస్తున్నాడు.

బాలీవుడ్ బడా స్టార్లతో మాత్రమే ప్లాన్ చేసే అతి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రభాస్‌తో తలపెట్టారంటే అతని క్రేజ్ ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. సౌత్ స్టార్లకు నార్త్‌లో ఈ స్థాయి ఆదరణ దక్కడం చాలా అరుదు. ప్రభాస్ రైట్ వేలో వెళుతూ తనకూ, మిగతా సూపర్‌స్టార్లకు వున్న అంతరాన్ని మరింత పెంచేస్తున్నాడు. మిగతా సూపర్‌స్టార్లు కూడా పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారు కానీ ప్రభాస్‌ని అందుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. 

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు