ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతూ ఉన్నారు. అన్ని శాఖల అంశాల్లోనూ ప్రభుత్వ సలహాదారే మాట్లాడుతున్నారు… అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పనిలో పనిగా పవన్ మరి కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడారు. అందులో ఒకటి మంత్రి బొత్స సత్యనారాయణ ఏమీ మాట్లాడటం లేదని.
బొత్స కు మంచి శాఖ కూడా ఇవ్వలేదట జగన్ మోహన్ రెడ్డి. బొత్సకు హోం లేదా ఆర్థిక వంటి శాఖ ఇవ్వాల్సిందట. బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్సను కేవలం పురపాలక శాఖా మంత్రిగా చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి దయనీయంగా ఉందని పవన్ సానుభూతి వ్యక్తం చేశారు!
మరి బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్స పరిస్థితి అంత దయనీయంగా ఉంటే, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ తన పార్టీలోకి చేర్చుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సింది! ఎవరు వద్దన్నారో! బొత్సకు ఈ ఆఫర్ ను ఇప్పుడైనా పవన్ కల్యాణ్ ఇవ్వొచ్చు. దానికి ఆయన ఎలా స్పందిస్తారో మరి.
అయితే బొత్స పొలిటికల్ రిటర్మైంట్ ను కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయకపోవచ్చని, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకుని, వారసులకు సీటును అప్పగించవచ్చని ఆఫ్ ద రికార్డుగా జరుగుతున్న ఒక ప్రచారం. ఇక పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టుగా పురపాలక శాఖ అనేది ఏమీ అంత తేలికైనది కాదు.
పవన్ కల్యాణ్ కు ఉన్న రాజకీయ అవగాహన ఎంతో అర్థం చేసుకోవడానికి పురపాలక శాఖను తక్కువ చేయడం కూడా ఒకటి! రాష్ట్రంలో హోం, ఫైనాన్స్, రెవెన్యూ వంటి శాఖలతో సమమైనది పురపాలక శాఖ కూడా. దాన్ని తక్కువ చేసి మాట్లాడి, కాపుల్లో సానుభూతిని పొందాలని పవన్ కల్యాణ్ మరీ థర్డ్ గ్రేడ్ కుల రాజకీయ నేతలా మాట్లాడుతున్నాడు.
అలాగే ఏపీ ప్రభుత్వ అన్ని శాఖల వ్యవహారాల్లోనూ సజ్జలే స్పందిస్తున్నారని మరో కుల కామెంట్ ను పవన్ పాస్ చేశారు. అయితే అంత కన్నా దయనీయం ఏమిటంటే.. జనసేనలో మూడో గ్రేడ్ నేతలు మాట్లాడాల్సిన మాటలను కూడా పవన్ కల్యాణే మాట్లాడుతున్నారు. ఏ పార్టీకి అయినా ఒక నిర్మాణం ఉంటుంది. స్థాయిని బట్టి నేతలు ఒక్కో అంశం మీద మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు పవన్ చేస్తున్న కుల కామెంట్లు ఉన్నాయే.. అవి ఏ పార్టీలో అయినా మూడో శ్రేణి నేతలు చేస్తూ ఉంటారు. కులాల గురించి మాట్లాడటం, తమ కులం నేతకు ఆపోజిట్ పార్టీలు తగిన ప్రాధాన్యత దక్కలేదనడం, ఈ తరహా కుల రాజకీయం అంతా.. ఏ పార్టీలో అయినా అధినేతలు చేసే రాజకీయం కాదు. గుర్తింపు కోసం ఆరాటపడుతూ, కనీసం ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేయడానికి కూడా అర్హత లేని నేతలు ఈ కామెంట్లు చేస్తూ ఉంటారు.
పవన్ కల్యాణ్ దురదృష్టం ఏమిటంటే.. ఎవరో అనామక నేతలు చేయాల్సిన కామెంట్లను అధినేత హోదాలోనే తనే చేయాల్సి వస్తోంది. మరి ఈ భావదారిద్య్రం తనకు పట్టిన విషయాన్ని పవన్ గుర్తించడం లేదు ఎందుకో! ఈ కుల కుష్టే చాలా సమ్మగా ఉందా?