ఆ హీరోయిన్ కు అప్పుడే..

ఒక్క సినిమా సరైనది పడితే చాలు. హీరో అయినా, హీరోయిన్ అయినా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. రేంజ్ పెరిగితే చాలు. మిగిలినవి అన్నీ పెరుగుతాయి. రెమ్యూనిరేషన్ పెరుగుతుంది.. కథల ఎంపిక పెరుగుతుంది. ఇంకా ఇంకా..…

ఒక్క సినిమా సరైనది పడితే చాలు. హీరో అయినా, హీరోయిన్ అయినా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. రేంజ్ పెరిగితే చాలు. మిగిలినవి అన్నీ పెరుగుతాయి. రెమ్యూనిరేషన్ పెరుగుతుంది.. కథల ఎంపిక పెరుగుతుంది. ఇంకా ఇంకా.. చాలా చాలా.

అయితే ఏవి పెరిగినా ఫరవాలేదు కానీ ‘నేను సూపర్.. నేను వేరే లెవెల్’ అనే భావన మాత్రం రాకూడదు. వస్తే నిర్మాతలకు కష్టం అవుతుంది. ఆ మధ్య ఓ సినిమా పెద్ద హిట్ అయింది. అంతే హీరోయిన్ కు మంచి పేరు వచ్చింది. ప్రశంసలు వచ్చాయి. కానీ దాంతో పాటే ఆటిట్యూడ్ కూడా బాగా వచ్చిందని గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. 

ఆ సినిమా సక్సెస్ తరువాత మలి సినిమాకు ఆటిట్యూడ్ వస్తే ఫరవాలేదని, ఆ సినిమా ఇంకా థియేటర్లలో వుండగానే ఇది ప్రారంభమైందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ సినిమా ప్రమోషన్లకు కూడా బాగా లేట్ గా రావడంతోనే ఇది అర్థమయందని ఆ వర్గాలు తెలిపాయి.

ప్రతి ఒక్కరు ఆమెను బాగా పొగడడం, ఆమె వల్లే సినిమా ఆడిందనేంతగా మాట్లాడడం, ఇవన్నీ కలిసి ఆమె వైఖరిలో మార్పు తెచ్చాయని అన్నారు. ఇది మరి ఆమె దృష్టికి వెళ్లిందో, లేదో.. వెళ్తే మార్చుకుంటే మంచిదే. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత చాలా వుంది. కాస్త మంచి హీరోయిన్ దొరికితే ఓ డజను సినిమాల వరకు ఢోకా వుండదు.