ఆమె హ్యాండ్ బ్యాగ్ క‌లెక్ష‌న్ విలువే రూ.కోట్ల‌లో!

స్త్రీల‌కు హ్యాండ్ బ్యాగ్ లు హ‌స్త‌భూష‌ణం అనే వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. మిడిల్ క్లాస్ మ‌గువ‌ల నుంచి హైక్లాస్ లేడీస్ వ‌ర‌కూ.. హ్యాండ్ బ్యాగ్ లు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు! అది కూడా ఒక బ్యాగ్…

స్త్రీల‌కు హ్యాండ్ బ్యాగ్ లు హ‌స్త‌భూష‌ణం అనే వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. మిడిల్ క్లాస్ మ‌గువ‌ల నుంచి హైక్లాస్ లేడీస్ వ‌ర‌కూ.. హ్యాండ్ బ్యాగ్ లు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు! అది కూడా ఒక బ్యాగ్ తో స‌ర్దుకుపోయే వారు త‌క్కువ‌గానే ఉంటారు.

ఉద్యోగిణులు అయితే.. త‌మ డ్రెస్ లోకి మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్ ను తీసుకెళ్ల‌డం సంగ‌తిని గురించి వ‌ర్ణించ‌న‌క్క‌ర్లేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ ల‌ను కొన‌డానికి ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్టుగా వారు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మ‌రి హీరోయిన్లు, సెల‌బ్రిటీలు కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

వారి రేంజ్ కు త‌గ‌ట్టుగా వారు కొనేస్తారు. అందులోనూ మీడియా క‌ళ్లు వారి హ్యాండ్ బ్యాగ్ ల‌పై కూడా ఉంటాయి. అందుకే వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ గ్రేడ్ చేయాల్సిందే, స్టైల్ స్టైల్ గా ఉండాల్సిందే! ఇందు కోసం స్టార్ హీరోయిన్లు అయితే భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేయ‌డం త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

ఇలాంటి జాబితాలో క‌రీనా క‌పూర్ కూడా నిలుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ లో క‌నిపించే క‌రీనా వీటి కోసం కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తుంద‌ట‌! ఫ్రాన్స్, ఇట‌లీ వంటి దేశాల నుంచి వీరు లెద‌ర్ బ్యాగ్ ల‌ను తెప్పించుకుంటూ ఉంటారు. వాటి ధ‌ర‌లు క‌ళ్లు చెదిరేస్థాయిలో ఉంటాయి. 

ఒకే బ్రాండ్ లో కూడా క‌నీసం నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో మొద‌లుపెట్టి, కోటి రూపాయ‌ల ధ‌ర పలికే బ్రాండ్లు ఉంటాయి. ఇలాంటి వాటిల్లో క‌రీనా వ‌ద్ద డ‌జ‌న‌కు పైగా బ్యాగులు ఉన్నాయ‌ని ఆమె వాటిని ధ‌రించి క‌నిపించ‌డాన్ని బ‌ట్టి తెలుస్తుంది. మ‌రి వీటి మొత్తం ధ‌ర ఎంత అంటే.. కోట్ల రూపాయ‌ల్లోనే అని అంచ‌నా!

క‌రీనా వ‌ద్ద ఉన్న అన్ని హ్యాండ్ బ్యాగ్ క‌లెక్ష‌న్ విలువ రెండు మూడు కోట్ల రూపాయ‌ల పై స్థాయిలోనే ఉండ‌వ‌చ్చ‌ని ఫ్యాష‌న్ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు! క‌రీనాకు ఈ విష‌యంలో మంచి పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా బాలీవుడ్ లో ఉన్నారు!