ఉరుములు మెరుపులు లేకుండానే భారీ వర్షం కురిసినట్టు…ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే హీరోయిన్ పెళ్లి చేసుకొంది. డైరెక్టర్‌తో తన మెళ్లో మూడు ముళ్లు వేయించుకుని…ఏడడుగులు నడిచింది. హీరోయిన్ షాలిని వడ్నికట్టి సడెన్‌గా తమిళ డైరెక్టర్ మనోజ్ బీదను పెళ్లాడడం హాట్ టాఫిక్ అయింది.
ఇటీవల ఓటీటీలో విడుదలైన మంచి ఆదరణ పొందిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా హీరోయిన్ షాలిని ఇప్పుడిప్పుడే ప్రేక్షకు లకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్లస్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆమె నటించి మెప్పించారు. హీరోయిన్గా కూడా ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారామె.
ఒక్కసారిగా ఆమె పెళ్లి పీటలు ఎక్కడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చేసింది తక్కువ సినిమాలే అయినా…కొత్త తారగా తనకంటూ చెప్పుకోతగ్గ స్థాయిలోనే అభిమానులను సంపాదించుకున్న షాలిని డైరెక్టర్ మనోజ్‌ను పెళ్లాడిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కారణంగా కోవిడ్ నిబంధనల్లో భాగంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా మనోజ్‌తో హీరోయిన్ పెళ్లి తంతు ముగిసింది. షాలిని పెళ్లి కుర్రకారుకు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు.