డ్యామేజ్ కంట్రోల్: ఈ ఏడాది హిట్ కొట్టాల్సిందే!

గతేడాది భారీ ఫ్లాపులు చూసిన హీరోలంతా ఈ ఏడాది టెన్షన్ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ఇవ్వాలనే టెన్షన్ వాళ్లలో కనిపిస్తోంది. మరి ఈ ఏడాది తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన ఆ హీరోలు ఎవరు?…

గతేడాది భారీ ఫ్లాపులు చూసిన హీరోలంతా ఈ ఏడాది టెన్షన్ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ఇవ్వాలనే టెన్షన్ వాళ్లలో కనిపిస్తోంది. మరి ఈ ఏడాది తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన ఆ హీరోలు ఎవరు?

వీళ్లలో ముందువరుసలో ఉన్న హీరో విజయ్ దేవరకొండ. లైగర్ తో భారీ డిజాస్టర్ చూసిన ఈ హీరో, ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతడి మార్కెట్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పడిపోతుంది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఖుషి సినిమా ఉంది.

ఇక ఈ ఏడాది మస్ట్ గా హిట్ కొట్టాల్సిన మరో హీరో చిరంజీవి. గతేడాది ఆచార్య రూపంలో భారీ డిజాస్టర్ ఇచ్చారు చిరంజీవి. గాడ్ ఫాదర్ కూడా మెరవలేదు. దీంతో వాల్తేరు వీరయ్య సినిమాతో గతేడాది చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలనుకుంటున్నారు చిరు.

ప్రభాస్ ది మరీ దారుణమైన పరిస్థితి. రాధేశ్యామ్ సినిమా ఇతడి కెరీర్ కు పెద్ద దెబ్బ. ఆ గాయం నుంచి కోలుకొని, తిరిగి తన మార్కెట్ ను నిలుపుకోవాలంటే ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో ప్రభాస్ ఓ హిట్ ఇచ్చి తీరాలి.

నాని కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. 2022లో 'అంటే సుందరానికి' సినిమా నానిని దెబ్బకొట్టింది. ఓ పదేళ్ల తర్వాత అది క్లాసిక్ అవుతుందని నాని సమర్థించుకున్నప్పటికీ, ప్రస్తుతానికైతే అతడికి అది ఫ్లాపే. దాన్నుంచి బయటపడాలంటే ఈ ఏడాది రిలీజ్ అవుతున్న దసరాతో హిట్ కొట్టాల్సిందే.

రామ్ కూడా ది వారియర్ రూపంలో భారీ ఫ్లాప్ ఇచ్చాడు. ఈ ఏడాది బోయపాటి సినిమాతో హిట్ కొట్టాల్సిందే. వీళ్లతో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఫ్లాపులిచ్చినప్పటికీ, ఈ ఏడాది ఎక్కువ ఒత్తిడి మాత్రం వీళ్లపైనే ఉంది. వీళ్లలో ముందుగా థియేటర్లలోకి వస్తున్నారు చిరంజీవి.