ఉద్యోగం చేసే భార్య..అవసరాలు తీర్చే మామ

సగటు కుర్రకారు జీవితాలు భలే చిత్రంగా వుంటాయి. బయటకు ఇస్త్రీ నలగని చొక్కాల్లా..లోపల కన్నాలు పడిన బనియన్ లా. కావాల్సినంత ఫన్..ఫ్రస్టేషన్. ఇలాంటి స్టోరీని తీసుకుని సినిమా చేసినట్లు కనిపిస్తోంది యువి సంస్థ. యువ…

సగటు కుర్రకారు జీవితాలు భలే చిత్రంగా వుంటాయి. బయటకు ఇస్త్రీ నలగని చొక్కాల్లా..లోపల కన్నాలు పడిన బనియన్ లా. కావాల్సినంత ఫన్..ఫ్రస్టేషన్. ఇలాంటి స్టోరీని తీసుకుని సినిమా చేసినట్లు కనిపిస్తోంది యువి సంస్థ. యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో ట్రయిలర్ ను హీరోయిన్ అనుష్క విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…ప్రేమించుకున్న శృతి..శివ లకు పెళ్లి అయిన తరువాత అసలు కథ మొదలవుతుంది. శివకు ఉద్యోగం వుండదు. శృతి కి మాత్రం భర్త ఉద్యోగం చేయాలి అన్న కోరిక. ఉద్యోగం పురుషలక్షణం అనిపించుకోవడం కోసం శివ తిప్పలు. వాటిలో పుట్టిన ఫన్..ఆపై భార్యకు నిజాలు తెలిసి వచ్చిన ఫ్రస్టేషన్. రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాను నడిపినట్లు కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా క్వాలిటీతో కనిపిస్తోంది. భావోద్వేగాలు కూడా బాగానే తెరపై పండించినట్లు క్లారిటీ ఇచ్చారు ట్రయిలర్ తో.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటం అంచనాలు పెంచుతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం – కృష్ణ కాంత్ అందించారు.