పళ్లతో లారీ లాగేశాడు.. గిన్నిస్ బుక్ ఎక్కేశాడు

పళ్లతో వస్తువులు, వాహనాలు లాగి రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఇంతకుముందు కొంతమందిని మనం చూశాం. కానీ ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. ఈ సెగ్మెంట్ లో…

పళ్లతో వస్తువులు, వాహనాలు లాగి రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు. ఇంతకుముందు కొంతమందిని మనం చూశాం. కానీ ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. ఈ సెగ్మెంట్ లో బాహుబలి లాంటి రికార్డును సృష్టించాడు.

ఈజిప్ట్ కు చెందిన ఇతగాడి పేరు మొహమ్మద్ సులేమాన్. ఇస్మాలియా ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఓ ట్రక్కును తన పళ్లతో లాగి పడేశాడు. అది అలాంటిలాంటి ట్రక్కు కాదు. ఏకంగా 15,730 కిలోల బరువున్న బెంజ్ కంపెనీకి చెందిన ట్రక్కు అది. దాన్ని అమాంతం లాగేశాడు మన సులేమాన్

ఈ ఫీట్ ను గిన్నిస్ బుక్ గుర్తించింది. తమ రికార్డుల్లోకి ఎక్కించింది. గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఇంత బరువైన వాహనాన్ని దంతాలతో లాగిన ఏకైక వ్యక్తి సులేమాన్ మాత్రమే.

ఇతడికి ఇలా వాహనాల్ని పళ్లతో లాగడం హాబీ. స్కూటర్ నుంచి మొదలుపెట్టి ఏళ్ల పాటు సాధన చేసి ఇలా హెవీ ట్రక్కును తన బలిష్టమైన దంతాలతో లాగేశాడు. భవిష్యత్తులో తన రికార్డును తానే తిరగరాస్తానని చెబుతున్నాడు ఈ పళ్ల వీరుడు.