నిమిషానికి కోటి రూపాయలు పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఇండియాలో ఉన్నారా? దీపిక పదుకోన్, అలియాభట్ లాంటి స్టార్ హీరోయిన్లు సైతం ఈ రేంజ్ లో లేరు. కానీ ఒకే ఒక్క హీరోయిన్ నిమిషానికి కోటి తీసుకుంటోంది. ఆమె పేరు ఊర్వశి రౌథేలా.
నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా చెబుతోంది. ఓ జర్నలిస్ట్ ఆమె ముందు మైక్ పెట్టాడు. నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటున్న నటిగా ఎలా ఫీలవుతున్నారని అడిగేశాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చింది ఊర్వశి.
“అదొక మంచి విషయం స్వశక్తితో పైకొచ్చే ప్రతి హీరోయిన్ అలాంటి ఓ రోజును చూడాలని కోరుకుంటుంది కదా.” ఇదీ ఊర్వశి రియాక్షన్. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. ఉర్ఫి జావెద్ లాంటి వాళ్లు ఊర్వశిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా రోజుకు 300-400 కోట్లు సంపాదిస్తోందని ఉర్ఫి కామెంట్ చేయగా.. నెటిజన్లు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
నిమిషానికి కోటి తీసుకుంటున్నావ్ సరే, అసలు ఏ సినిమాలో నటిస్తున్నావంటూ కొందరు ఎగతాళి చేయగా.. యాక్టింగ్ తో పాటు ఇంకా ఏమేం చేస్తున్నావంటూ మరికొందరు అభ్యంతరకరంగా స్పందించారు. 'పచ్చి అబద్ధాల్ని కూడా చాలా ఈజీగా, ఇబ్బంది పడకుండా చెప్పేస్తుంది, అందుకే ఆమె అంటే నాకిష్టం' అంటూ మరొకరు పంచ్ వేశారు.
ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని పెయిడ్ పోస్టులకు ఆమె డబ్బులు తీసుకుంటుంది. ఆమె ప్రధాన సంపాదన అది మాత్రమే. రీసెంట్ గా టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ చేస్తోంది. వాటి రూపంలో ఆమె కొంత సంపాదిస్తోంది. ఇంతకుమించి ఆమెకు ఆదాయ వనరులు లేవు, బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ చాలా తక్కువ.
మరి ఈ క్రేజ్ తో ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకోవడం సాధ్యమేనా? ఇదే అంశంపై ఊర్వశిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే ఈ బ్యూటీకి ఇలాంటి ట్రోలింగ్స్ కొత్త కాదు. ఎప్పట్లానే దీన్ని కూడా ఆమె లైట్ తీసుకుంది.