ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ నగ్మ. ఈ అందాల నటికి ఇంకా పెళ్లి కాలేదనే విషయం తెలిస్తే కొంతమంది ఆశ్చర్యపోతారు. నిజం.. నగ్మాకు ఇంకా పెళ్లికాలేదు.
దాదాపు 3 దశాబ్దాలుగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది ఈ మాజీ హీరోయిన్. గతంలో పలుమార్లు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకొని ఏం సాధించాలంటూ రివర్స్ లో ప్రశ్నించింది. ఆ బంధంలోకి అడుగుపెట్టాలని లేదంటూ కరాఖండిగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఎట్టకేలకు ఈ హీరోయిన్ మనసు మారినట్టుంది.
పెళ్లిపై ఈసారి పాజిటివ్ గా స్పందించింది నగ్మా. తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ప్రకటించింది. తను వివాహం చేసుకోకూడదనే నియమం పెట్టుకోలేదని, అది అలా జరిగిపోయిందంటూ వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని, కుటుంబంతో కలిసి ఉండాలని తనకు అప్పుడప్పుడు అనిపిస్తుందని, కాలం కలిసొస్తే అది జరుగుతుందని తెలిపింది.
గతంలో నగ్మాపై చాలా పుకార్లు వచ్చాయి. సీనియర్ నటుడు శరత్ కుమార్ నుంచి భోజ్ పురి నటుడు రవికిషన్ వరకు ఆమెతో ఎఫైర్ లో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. మధ్యలో మనోజ్ తివారి, సౌరభ్ గంగూలీ పేర్లు కూడా వినిపించాయి. అయితే అప్పటికీ వీళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అయినప్పటికీ నగ్మాతో డేటింగ్ అంటూ పుకార్లు వచ్చాయి.
అలా గడిచిన పాతికేళ్లుగా డేటింగ్స్ తోనే కాలం గడిపేసింది నగ్మా. ప్రస్తుతం ఈమె వయసు 48 ఏళ్లు. ఇప్పుడు ఆమెకు పెళ్లిపై మూడ్ వచ్చింది. కాలం కలిసొస్తే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కంటానంటోంది.