దశాబ్దానికి పైగా చలనచిత్రరగంలో అగ్రస్థానంలో కొనసాగితే స్టార్ స్టాటస్ తో పాటూ కోట్లు సంపాదించుకుని వెనకేసుకోవడం కూడా జరుగుతుంది. సాధారణంగా ఏ హీరో ఎంత సంపాదించాడు అన్నదాని గురించి ఎక్కువగా వార్తలుంటాయి కానీ హీరోయిన్స్ గురించి అంతగా వినపడవు.
మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎప్పుడో 2007లో హ్యాపీ డేస్ తో అందరికీ సుపరిచితమైన తమన్నా క్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 17 సంవత్సరాల ఆమె కెరీర్లో ఎక్కడా డౌన్-ఫాల్ లేకుండా ఆయేటికాయేడు తన స్థానంలో తాను కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమెకు 33 ఏళ్లు. అయినా చెక్కుచెదరని అందం ఆమె సొంతం.
సినిమాలతో పాటూ ఫాంటా, సెల్కాన్ వంటి బ్రాండ్స్ కి పలు శారీ షోరూంలకి కూడా బ్రాండ్ అంబాసడర్ గా కనిపిస్టొంది. ఒక లెక్క ప్రకారం ఆమె వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ 12 కోట్లు ఉందట. అంటే సగటున నెలకి కోటి రూపాయల సంపాదన. ఆమె ఇప్పటికే వెనకేసిన ఆస్తి విలువ రూ 110 కోట్ల పైమాటే అంటున్నారు.
ఒక్కో సినిమాకి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే తమన్నా ఒక్క ఐటం సాంగ్ కి 60 లక్షలు చేసుకుంటోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో 10 నిమిషాల పాటు నర్తించడానికి ఆమెకు ముట్టిన మొత్తం రూ 50 లక్షలు.
చాలామందికి తెలియకపోవచ్చు కానీ తమన్నా 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక జివెల్రీ బ్రాండ్ కూడా స్థాపించింది. ఈమె వద్ద రూ 2కోట్లు విలువైన ఒక అరుదైన వజ్రం కూడా ఉందట. అది ఉపాసన కొణిదెల ఆమెకు బహుమానంగా ఇచ్చిందట. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి.
ఇంతేకాకుండా తమన్నాకి ముంబాయిలోని వెర్సోవాలో రూ 16 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫ్లాట్, లాండ్ రోవర్ డిస్కవరీ, బీ.ఎం.డబల్యూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఆమె వాడే చానల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదే రూ 3 లక్షలు.
ఇలా ఎలా చూసుకున్నా తమన్నాని అత్యంత విజయవంతమైన నటిగా చెప్పుకోవచ్చు. ఆమె కచ్చితంగా స్ఫూర్తిదాయకం. ఆమె రంగంలో విమన్ పవర్ కి నిదర్శనం.