వీరయ్య-సెన్సార్ రిపోర్ట్ ఇదే

వాల్తేర్ వీరయ్య సెన్సారు ఫార్మాలిటీ జరిగిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చిన్న చిన్నవి బకాయి వున్నాయి. బట్ ఫైనల్ కాపీ ఏదయితే లాక్ చేసారో అది సెన్సారు కు ఇవ్వడం సర్టిఫికెట్ రావడం…

వాల్తేర్ వీరయ్య సెన్సారు ఫార్మాలిటీ జరిగిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చిన్న చిన్నవి బకాయి వున్నాయి. బట్ ఫైనల్ కాపీ ఏదయితే లాక్ చేసారో అది సెన్సారు కు ఇవ్వడం సర్టిఫికెట్ రావడం జరిగిపోయింది. దీంతో ఇండస్ట్రీలో సెన్సారు టాక్ అంటూ విపరీతంగా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సెన్సారు రిపోర్ట్ ను క్రోడీకరిస్తే ఇలా వుంది.

సినిమా తొలిసగం పక్కా ఎంటర్ టైన్ మీదనే సాగింది. మొన్ననే మెగాస్టార్ చెప్పినట్లు రొటీన్ నే కానీ జనాలను అలరించేలాగే వుంది ఈ ఎంటర్ టైన్ మెంట్ అన్నది టాక్. అయితే మార్కుల లెక్కలు చూస్తే తొలిసగం కన్నా మలి సగానికి ఎక్కువ మార్కులు పడతాయని వినిపిస్తోంది. మలిసగంలో రవితేజ ఎపిసోడ్ నలభై నిమషాలకు పైగా వుంది.

ఈ ఎపిసోడ్ మీదే సినిమా కీలకంగా ఆధారపడింది. ఈ ఎపిసోడ్ చివర్లో చిరు..రవితేజల మధ్య వచ్చే ఎమోషన్ సీన్లు బాగానే పండాయని వినిపిస్తోంది. సినిమాలో రెండు పాటల చిత్రీకరణ బాగుందని అంటున్నారు. 

ఓవరాల్ గా ఇది రొటీన్ కథతో అయినా సంక్రాంతి బరిలోకి పెర్ ఫెక్ట్ సినిమా అన్నది సెన్సారు టాక్. రవితేజ ఎపిసోడ్ కనుక జనాలకు పడితే సినిమా మంచి హిట్ అవుతుందన్నది టోటల్ గా వినిపిస్తున్న సంగతి.