వీరసింహా..వీరయ్య సినిమాల బిజినెస్

సంక్రాంతికి పోటా పోటీగా వస్తున్నాయి వాల్తేర్ వీరయ్య…వీర సింహా రెడ్డి. ఈ రెండు సినిమాలను మైత్రీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. వీర సింహా రెడ్డి సినిమాకు దాదాపు 110 కోట్ల వరకు…

సంక్రాంతికి పోటా పోటీగా వస్తున్నాయి వాల్తేర్ వీరయ్య…వీర సింహా రెడ్డి. ఈ రెండు సినిమాలను మైత్రీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. వీర సింహా రెడ్డి సినిమాకు దాదాపు 110 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. అలాగే వాల్తేర్ వీరయ్య కు 140 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. ఇక్కడ తేడా రెమ్యూనిరేషన్లే. బాలయ్య రెమ్యూనిరేషన్ 15 కోట్లు. మెగాస్టార్..రవితేజ రెమ్యూనిరేషన్లు కలిపి దాదాపు 50 కోట్లకు పైగానే.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల థియేటర్ మార్కెట్ ఎంత? అన్నది క్వశ్చను. ఆంధ్ర ఏరియా అంతా కలిపి రెండు సినిమాలకు 75 కోట్ల మేరకు ఫిక్స్ చేసారు. 35 కోట్లు బాలయ్య సినిమా, 40 కోట్లు చిరంజీవి సినిమా. అలాగే సీడెడ్ ఏరియాకు రెండు సినిమాలు కలిపి 27 కోట్ల మేరకు ఫిక్స్ చేసారని తెలుస్తోంది. చిరంజీవి సినిమా 14.5 కోట్లు బాలయ్య సినిమా 12.5 కోట్లు కింద విక్రయించారు.

నైజాం మెగా మూవీ 18 కోట్లు, బాలయ్య మూవీ 15 కోట్లు ఫిక్స్ చేసారు. అంటే ముఫై మూడు కోట్లు అన్నమాట. అన్ని ఏరియాలు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ సిస్టమ్ మీద ఇచ్చారు. అందువల్ల ఓవర్ ఫ్లోస్ వస్తే నిర్మాతలకు ఇంకా ఆదాయం వుంటుంది. ఒక వేళ ఏదైనా పరిస్థితుల్లో రాకపోతే జీఎస్టీలు దాదాపు ముఫై కోట్ల వరకు నిర్మాతలు భరించాల్సి వుంటుంది.

మొత్తం మీద ఆంధ్ర..సీడెడ్..నైజాం కలిపి వీరయ్య..వీరసింహా కలిపి 135 కోట్ల థియేటర్ బిజినెస్ చేసారు. బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే దీనికి పదిశాతం ఖర్చులు కలపాలి. కమిషన్ లు రావాలంటే మరో 20శాతం కలపాలి.