మంచి రోజులు..’రొమాంటిక్’ ట్రయిలర్

ఇవ్వాళ రేపు సినిమాలకు ఎంత పబ్లిసిటీ మెటీరియల్ వున్నా సరిపోవడం లేదు. జనాలు థియేటర్ కు వచ్చే వరకు టెన్షన్ నే. ఓటిటి పుణ్యం. కరోనా చేసిన పాపం. అందుకే సినిమాలకు ఒకటికి నాలుగు…

ఇవ్వాళ రేపు సినిమాలకు ఎంత పబ్లిసిటీ మెటీరియల్ వున్నా సరిపోవడం లేదు. జనాలు థియేటర్ కు వచ్చే వరకు టెన్షన్ నే. ఓటిటి పుణ్యం. కరోనా చేసిన పాపం. అందుకే సినిమాలకు ఒకటికి నాలుగు టీజర్లు, ఒకటికి రెండు ట్రయిలర్లు వదులున్నారు. 

మారుతి డైరక్షన్ లో యువి-ఎస్కేఎన్ కలిసి నిర్మించిన సినిమా మంచి రోజులు వచ్చాయి కి కూడా రెండో ట్రయిలర్ వదిలారు. ఒక ట్రయిలర్ వారం కిందట వదిలారు. పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రయిలర్ అది. కానీ ప్రస్తుతం ట్రెండ్ వేరుగా వుంది. ఎంత రొమాన్స్ కుమ్మేస్తే జనాలు చొంగలు కార్చుకుంటే థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు.

అంటే కామెడీ సినిమాకు రొమాంటిక్ కోటింగ్ అన్నమాట. మారుతి ఇప్పుడు వదిలిన ట్రయిలర్ ఈ అయిడియాతోనే కట్ చేసినట్లు వుంది. సినిమాలోని రొమాంటిక్ సీన్లు అన్నీ తీసి వేసి యూత్ ను అట్రాక్ట్ చేసే పని పెట్టుకున్నారు. ఆపైన మళ్లీ తన మార్కు వుండాలి కదా అని, కామెడీ సీన్లు జోడించారు. 

మొత్తానికి కరోనా, ఓటిటి పుణ్యమా అని టాలీవుడ్ మేకర్లు చాలా తంటాలు పడాల్సి వస్తోంది.