ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు వంగా సందీప్. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో అందించి అందరి దృష్టిని ఆకర్షించేసాడు.
ఇప్పుడు ఏకంగా మరో పాన్ ఇండియా సినిమా 'స్పిరిట్' ను అనౌన్స్ చేసేసాడు. ప్రభాస్ తో నిర్మించే ఈ సినిమా బడ్జెట్ నే నాలుగు వందల కోట్ల వరకు వుంటుందని టాక్.
ఎంత వరకు ఫ్యాక్ట్ అన్నది తెలియదు కానీ, ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనిరేషన్ 150 కోట్ల పైమాటే అని వినిపిస్తోంది. అయితే ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమాకు గాను సందీప్ వంగా కు లాభాల్లో యాభై శాతం వాటా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదే అతగాడి రెమ్యూనిరేషన్ అన్నమాట.
లాభాల్లో యాభైశాతం రెమ్యూనిరేషన్ అంటే ఏ రేంజ్ లో వుంటుందో మరి. అయితే ఈ సినిమాకు ఇంకా టైమ్ వుంది. సలార్, ఆదిపురుష్ పూర్తి చేయాలి. ఆ తరవాత ఇది. ఇది కాకుండా ప్రభాస్ చేతిలో ఇంకో రెండు సినిమాలు కూడా వున్నాయి.