మౌత్ టాక్ పవర్: దుమ్ముదులుపుతున్న ఖైదీ

విడుదలైన మొదటి రోజు ఈ సినిమాను పట్టించుకున్న నాథుడు లేడు. తెలుగులో ఆక్యుపెన్సీ 30శాతం కూడా లేదు. కానీ మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులకు ఖైదీ పిచ్చిగా నచ్చింది. ఆ టాక్ అలా…

విడుదలైన మొదటి రోజు ఈ సినిమాను పట్టించుకున్న నాథుడు లేడు. తెలుగులో ఆక్యుపెన్సీ 30శాతం కూడా లేదు. కానీ మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులకు ఖైదీ పిచ్చిగా నచ్చింది. ఆ టాక్ అలా అలా పెద్దదైంది. అలా కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 30 లక్షల రూపాయల షేర్ కే పరిమితమైన ఖైదీ సినిమాకు వారం తిరిగేసరికి 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయంటే.. ఈ సినిమా విషయంలో మౌత్ టాక్ ఏ రేంజ్ లో ప్రభావం చూపించిందో అర్థంచేసుకోవచ్చు.

సోమవారం కంటే మంగళవారం ఎక్కువగా… మంగళవారం కంటే బుధవారం ఇంకాస్త ఎక్కువగా.. ఇలా రోజురోజుకూ ఖైదీ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.

దీనికి తోడు మొదటి వారాంతం తర్వాత నైజాంలో సినిమాకు థియేటర్లు కూడా పెంచడంతో ఖైదీ ఊపందుకుంది. అలా చాన్నాళ్ల తర్వాత తెలుగులో కార్తికి ఓ మంచి విజయాన్నందించింది ఈ సినిమా.

అటు తమిళనాడులో కూడా ఖైదీ హవా నడుస్తోంది. ఇప్పటికే 25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కర్ణాటక, కేరళతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా డీసెంట్ వసూళ్లు రావడంతో.. వారం తిరిగేసరికి ఖైదీ కలెక్షన్లు వరల్డ్ వైడ్ 40 కోట్ల రూపాయల గ్రాస్ కు చేరుకున్నాయి.

తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసిన రాధామోహన్ కూడా ఎట్టకేలకు ఓ విజయం అందుకున్నారు. సక్సెస్ తో పాటు లాభాలు కూడా అందుకోబోతున్నారు.