మీడియాధిపతులు కారు..కులాధిపతులు

కొందరు మీడియా అదిపతులు కులాధిపతులుగా మారారని పౌర సరఫాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. Advertisement కలానికి సంకెళ్లు అంటూ కొన్ని పత్రికలు రాస్తున్నాయని,అది కులానికి సంకెళ్లు అనుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవ…

కొందరు మీడియా అదిపతులు కులాధిపతులుగా మారారని పౌర సరఫాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

కలానికి సంకెళ్లు అంటూ కొన్ని పత్రికలు రాస్తున్నాయని,అది కులానికి సంకెళ్లు అనుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు. చంద్రబాబు,ఆయన డబ్బా పత్రికలు ఇలా గొడవ చేస్తున్నాయని ఆయన అన్నారు. 

ఆర్టిసి ఎమ్.డి సురేంద్రబాబు బదిలీ పై తప్పుడు కదనాన్ని ఇచ్చిందని, దానిని ఖండిస్తే ,దానిని వేయకుండా, వారి కట్టుకదలనే ఆ పత్రిక ప్రచారం చేసిందని ఆయన అన్నారు.

కొంతమంది గుంటనక్కలను చంద్రబాబు వంటి వెదవలను సమర్దించడానికి, ఆయన ఉంటే వీళ్లే ఎక్కువ పాలన చేయవచ్చని భావిస్తున్నారని మీడియాపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిస్తితిలో పరువు నష్టం పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

గతంలో మోడీని తిడుతూ చంద్రబాబు అన్ని రాష్ట్రాలను తిరిగారని, అంతా మూతిపై కొడితే, నోరుమూసుకుని ఇక్కడ కూర్చున్నారని ఆయన అన్నారు. అయితే ఇక్కడ జగన్ పై మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తమ కులమే అదికారంలో ఉండాలని, తామే అధికారంలో ఉండాలని కోరుకునేవారికి కులానికి సంకెళ్లు తప్ప, కలానికి సంకెళ్లు కాదని ఆయన అన్నారు.

జగన్ ఒక్కడిని చేసి ఏరకంగా ఆయనను ఇబ్బంది పెట్టేయత్నం చేశారో అందరికి తెలుసునని ఆయన అన్నారు.