బాహుబలి సినిమాతో పాన్-ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ ను, అతడి పెదనాన్న కృష్ణంరాజు ఓ కోరిక కోరారు. అదేంటంటే.. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ప్రభాస్ తో కలిసి భోజనం చేయాలి. ఈ కోరిక వెనక అసలు లాజిక్ ఏంటో ఆయన మాటల్లోనే..
“నా కోరిక ఏంటంటే.. ప్రభాస్ తో కలిసి బెవర్లీ హిల్స్ లో భోజనం చేయాలి. బెవర్లీ హిల్స్ లో హాలీవుడ్ స్టార్స్ ఉంటారు. చాలా చాలా కాస్ట్ లీ ఏరియా. అలాంటి ఏరియాలో ప్రభాస్ కు కూడా ఓ బిల్డింగ్ ఉండాలి. ఆ భవంతిలో ప్రభాస్ తో కలిసి నేను భోజనం చేయాలనేది నా కోరిక.”
బాహుబలి టైమ్ లోనే ప్రభాస్ ను ఈ కోరిక కోరినట్టు వెల్లడించారు కృష్ణంరాజు. ఆ రోజు త్వరలోనే వస్తుందంటున్నారు. తన కోరికకు తగ్గట్టే ప్రభాస్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడని మెచ్చుకున్నారు.
ఆదిపురుష్ సినిమాతో ఓ ఇతిహాసాన్ని ప్రపంచ దేశాలకు ప్రభాస్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న కృష్ణంరాజు.. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రపంచం గుర్తించే స్టార్ అవుతాడని అంటున్నారు.