కే ఎఫ్ సి కమలాకర్ రెడ్డి మృతి

టాలీవుడ కు దుర్వార్త. కె ఎఫ్ సి సంస్థ అధినేతల్లో ఒకరైన కమలాకర్ రెడ్డి రోడ్ ప్రమాదంలో మృతి చెందారు.  కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆయన నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో వుంటున్నారు. కానీ…

టాలీవుడ కు దుర్వార్త. కె ఎఫ్ సి సంస్థ అధినేతల్లో ఒకరైన కమలాకర్ రెడ్డి రోడ్ ప్రమాదంలో మృతి చెందారు.  కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆయన నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో వుంటున్నారు. కానీ ఇటీవలే ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డి (75) కి కరోనా పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో కమలాకర్ రెడ్డి పరిక్ష చేయించుకుంటే ఆయనకు కూడా పాజిటివ్ అని తేలింది.

దీంతో తండ్రిని తీసుకుని, అంబులెన్స్ లో హైదరాబాద్ కు బయల్దేరారు. కానీ నల్గొండ జిల్లా  దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కమలాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు ద్రిగ్భాంతి వ్యక్తం చేసారు. చాలా మందికి సన్నిహితుడుగా, సాయం చేసే వ్యక్తిగా కమలాకర్ కు మంచి పేరు వుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, నిర్మాత టాగోర్ మధుకు ఆయన అత్యంత సన్నిహితుడు.