ఉద్దానం కిడ్ని సమస్యను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితమై ప్రచార్భాటం చేశారు. ఎన్నెన్నో సమావేశాలు, పర్యటనలతో పాటు బాధితులను ఆదుకుంటామంటూ గోరంతలు- కొండంతలుగా తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఏళ్ల తరబడి సమస్యను వాడుకుని బాధితుల ముందు కళ్లనీరు పెట్టారు. కానీ వారిని అధికారంలో ఉన్నంతకాలం ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రచారం లేదు, ఆర్భాటం అసలే లేదు, పర్యటనలూ అంతకన్నా లేవు.
నాటి మొసలి కన్నీరు అస్సలు కానరాదు. అంతా ఆచరణలోకి వచ్చేసింది. బాధితులను ఆదుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడు కనపెట్టింది. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చింది. ఏమాత్రం హడావుడి, ఆర్భాటం లేకుండానే సమగ్ర తాగునీటి పథకం అమలు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా కార్యాచరణతో రంగంలోకి దిగిపోయింది.
ప్రపంచంలోనే అరుదైన సమస్యకు మేఘా పరిష్కారం
ప్రపంచంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో అల్లాడే నాలుగు ప్రాంతాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గ్రామం. ప్రపంచంలోని నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ప్రపంచంలోనే తోలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంచినీటిలో ఉన్న విషపూరిత కారకాలు ఇక్కడ ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పలు పరిశోధనలో ప్రాధమికంగా తేల్చారు.
ఈ సమస్యకు పరిష్కారం ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీటిని అందించటమేనని దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లోనే తలంచారు. అనుకున్నదే తడవుగా ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన మరణంతో ఈ పథకం అటకెక్కింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం సమస్య పరిష్కారానికి ప్రయత్నించలేదు. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసి వదిలేశారే తప్ప పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.
బాబు, పవన్ కళ్యాణ్ మాటలు, పర్యటనలకే మాత్రమే పరిమితమయ్యారు. సమస్యను రాజకీయంగా వాడుకున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్దానం లో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటం తో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ 700 కోట్ల అంచనాలతో ఈ పధకాన్నిడిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ 527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది.
ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఎంఈఐఎల్ సన్నాహాలు చేస్తోంది. ఏపి ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపించనుంది. ఆ ప్రాంత ప్రజలు కిడ్నీ సమస్యకు త్వరలో దూరం కానున్నారు.
తాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఈ పథకాన్ని నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ఏపి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది.
దాదాపు 100 కిలోమీటర్ల నుంచి తాగునీరు…
ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది నివశిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు తాగునీటి అవసరాలకు ఎక్కువగా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత భూ గర్భ జలాలలో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నట్టు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి.
మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు.
ఏళ్ళుగా పీడిస్తున్న ఉద్దానం సమస్య
అసలు ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు.. ఏళ్ళతరబడి నలుగుతోంది. ఆ సమస్యను పరిష్కరించడం ఎవరితరం కాలేదు. సుదీర్ఘమైన సమస్యను ఇప్పుడు జగన్ పరిష్కరిస్తున్నారంటే గతంలో ఎంత తీవ్రంగా వేధించిందో పరిశీలించాలి. ఉద్దానం లో కిడ్నీ సమస్య 1985-86 ప్రాంతాల్లోనే బైట పడింది. 1990 దశకంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. స్థానికంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే పాలకులు అప్పుడు ఈ సమస్యను తేలికగా తీసుకున్నారు.
రోజు రోజుకు కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో నాటి పాలకులు తాత్కాలిక ఉపశమ చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. గతంలో నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి స్థానికి నేతలు సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఒక సమగ్ర ప్రణాలి కను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అది ఒక కొలిక్కి వచ్చే సమయానికి మరణించారు. 2014 లో తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రాబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. తెలుగుదేశం మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017లో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి ఎంతో హడావుడి చేశారే తప్ప సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయలేదు. ఆయన 2018 మే లో ఎచ్చెర్ల లో దీక్ష చేసి మరింత హడావుడి చేశారు. ఆ తరువాత నాటి ముఖ్య మంత్రి చంద్ర బాబు వివిధ సమావేశాలతో ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారే తప్ప చేసింది శూన్యం. హార్వార్డ్ విశ్వ విద్యాలయ బృందం, 2017 జనవరి లో అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , ప్రస్తుత బి జె పీ అధ్యక్షుడు జె పీ నడ్డా విశాఖ పట్నం లో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్య పై అధ్యయనానికి నిపుణుల బృందాన్ని పంపుతాన ని చెప్పారు.
ఇప్పటి వరకు ఎన్ జి ఆర్ ఐ, బాబా అణు పరిశోధనా కేంద్రం, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఐ సి ఎం ఆర్, పలు ప్రైవేట్ సంస్థలు ఉద్దానం సమస్య పై అధ్యనం చేసాయి. అయితే సమస్యకు మూల కారణం మాత్రం కనుక్కోలేక పోయాయి. ఉద్దానంలో ప్రతి వంద మంది లో 35 నుంచి 40 మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారంటే సమస్య తీవ్రత యెంత ఎక్కువగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 17 మొబైల్ కేంద్రాల ద్వారా ఉద్దానం విస్తరించి ఉన్న పలు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు పరీక్షలు చేశారు.
107 గ్రామాల్లో 1. 3 లక్షల జనాభాను పరీక్షిస్తే 14 వేల మంది కిడ్నీ బాధితులు తేలారు. కవిటి మండలం లో కిడ్నీ బాధితుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ఉద్దానం లో కిడ్నీ సమస్య వెలుగు లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 10 వేల మంది మరణించి ఉంటారని ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వారి అంచనా. ఉద్దానం పరిధి లోని ప్రతి గ్రామం లో రెండు రోజులకు ఒకరు కిడ్నీ సమస్య తో మరణిస్తుంటారని ఓ అంచనా.