రాధేశ్యామ్ వడ్డీ భారం 60 కోట్లు?

సినిమా అంటేనే కోట్లతో పందెం. ప్రభాస్ లాంటి హీరోతో పాన్ ఇండియా సినిమా అంటే వందల కోట్ల పెట్టుబడి. అంత పెట్టుబడి ఎవ్వరూ స్వయంగా పెట్టలేరు. ఫైనాన్స్ మీద ఆధారపడాల్సిందే.  Advertisement అందులోనూ రెండు…

సినిమా అంటేనే కోట్లతో పందెం. ప్రభాస్ లాంటి హీరోతో పాన్ ఇండియా సినిమా అంటే వందల కోట్ల పెట్టుబడి. అంత పెట్టుబడి ఎవ్వరూ స్వయంగా పెట్టలేరు. ఫైనాన్స్ మీద ఆధారపడాల్సిందే. 

అందులోనూ రెండు కరోనా దశలు చూసిన సినిమా. ఎప్పటికి అయినా విడుదల అవుతుందా? అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసిన సినిమా. అలాంటి సినిమా మరో రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని వార్తలు వున్నాయి. ఎంత స్వంత పెట్టుబడి, ఎంత ఫైనాన్స్ అన్న వివరాలు తెలియవు కానీ యువి సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద యాభై నుంచి అరవై కోట్లు వడ్డీలకు చెల్లించినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణంలోనే వుంది. అందువల్ల వడ్డీల భారం తక్కువేమీ వుండదు. ఆ భారమే యాభై నుంచి అరవై కోట్ల రేంజ్ అని టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తోంది.