బీజేపీతో ఢీ అంటున్న శివసేన!

పదవుల పంపకం, ముఖ్యమంత్రి పదవి విషయంలో ఫిఫ్టీ: ఫిఫ్టీ ఫార్ములాపై తాము మెత్తబడినట్టుగా వస్తున్న వార్తలను ఖండించింది శివసేన. తమకు ముఖ్యమంత్రి పదవీకాలం సగం ఇవ్వడంతో పాటు, మంత్రి పదవుల విషయంలో కూడా యాభైశాతం…

పదవుల పంపకం, ముఖ్యమంత్రి పదవి విషయంలో ఫిఫ్టీ: ఫిఫ్టీ ఫార్ములాపై తాము మెత్తబడినట్టుగా వస్తున్న వార్తలను ఖండించింది శివసేన. తమకు ముఖ్యమంత్రి పదవీకాలం సగం ఇవ్వడంతో పాటు, మంత్రి పదవుల విషయంలో కూడా యాభైశాతం వాటా కావాలంటూ భారతీయ జనతా పార్టీని శివసేన డిమాండ్ చేస్తూనే ఉంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ఆలోచనే తమకు లేదని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో శివసేన ఇలా ఘాటుగా స్పందించింది. ఢీ అంటున్నట్టుగా ప్రకటించుకుంది.

అలాగే శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలవడం ఆసక్తిదాయకమైన రాజకీయ పరిణామంగా నిలుస్తూ ఉంది. తమకు ముఖ్యమంత్రి పదవి సగంకాలం ఇవ్వాల్సిందే అని వాదిస్తున్న శివసేన తమకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని కూడా ఇదివరకూ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సేనకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. అయితే కేంద్రంలో బీజేపీ పవర్ లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూటమితో వెళ్లేందుకు శివసేన సాహసిస్తుందా? అనేది సందేహాస్పదమైన విషయమే.

అయితే పవార్ ను కలిసి సంజయ్ రౌత్ ఒకింత సంచలనమే రేపాడు. మరో ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. శివసేన వాళ్లు తమ లెజిస్టేటివ్ విభాగానికి ఏకనాథ్ షిండేను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆదిత్యఠాక్రే శివసేన ఎల్పీ లీడర్ గా ఎన్నికవుతారనే అంచనాలకు భిన్నంగా ఏకనాథ్ షిండేను ఎన్నుకోవడం గమనార్హం.

ఉత్తుత్తినే ఆరోపణలు చేశామని ఒప్పుకున్నట్లేగా!