ఆ మధ్య ఉన్నట్లుండి జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో హీరో బన్నీ మీద ఫ్లెక్సీ కనిపించింది. స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తున్నారంటూ. అప్పట్లో అసలు విషయం బయటకు రాలేదు. కానీ లేట్ గా అయినా అసలు సంగతి తెలుస్తోంది.
విషయం ఏమిటంటే… అల వైకుంఠపురంలో 'రాములో.. రాములు' సాంగ్ కు బన్నీ ఏరి కోరి ముంబాయి డ్యాన్సర్లను రప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతమంది లోకల్ డ్యాన్సర్లను కూడా తీసుకోవాలి అనే లెక్క, రూలు ఒకటి మన ఇండస్ట్రీలో వుంది. అందువల్ల డబ్బులు పోతే పోయాయి, గొడవెందుకు అని లోకల్ వాళ్లని కూడా తీసుకున్నారు.
కానీ ఇక్కడే తెలివిగా ఓ పనిచేసారు. పాటలో హీరో చుట్టూ, కెమేరా లుక్ లో, ఫ్రంట్ ప్లేస్ లో ముంబాయి డ్యాన్సర్లను వుంచి, చివరగా లోకల్ జనాలను వుంచినట్లు తెలుస్తోంది. దాంతో లోకల్ డ్యాన్సర్లు కాస్త హర్ట్ అయ్యారు. ఇది తెలిసి బన్నీ లోకల్ డ్యాన్సర్లను పిలిచి, స్టెప్ లు వేయమని, ముంబాయి డ్యాన్సర్లను పిలిచి, వాళ్లనూ వేయమని చిన్న హడావుడి చేసి, వర్క్ లో తేడాలు వివరించి, ఆపై క్లాసు పీకారని తెలుస్తోంది.
దాని పర్యవసానంగానే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఫ్లెక్సీ వెలిసిందని తెలుస్తోంది. అయితే ఆ తరువాత కూడా బన్నీ ఈ ఫ్లెక్సీ గురించి ఆరాతీసి, మళ్లీ సంబంధీకులు ఎవరు అన్నది తెలుసుకుని, వాళ్లనూ పిలిచి క్లాస్ పీకినట్ల బోగట్టా.