మహేష్ బాబు అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో రాజమౌళితో చేయబోయే సినిమా ఒకటి. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న మహేష్ దాని తరువాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేస్తారు. దీనికి నిర్మాత కేఎల్ నారాయణ.
ఇది రాజమౌళికి ఎప్పటిదో కమిట్ మెంట్. ఇక్కడి వరకు సమాచారం అందరికీ తెలిసిందే. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ ప్రాజెక్ట్ లోకి మరో నిర్మాత కూడా జాయిన్ అయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.
ప్రపంచ భాషలు అన్నింటిలో తయారయ్యే ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్ లో, అది కూడా బాండ్ సినిమాల తరహాలో వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని బడ్జెట్ అయిదారు వందల కోట్లు వుంటుంది.
అందుకే ఈ ప్రాజెక్టులోకి కేఎల్ నారాయణ తో పాటు మరో నిర్మాతను జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రొడక్షన్ పూర్తిగా చూసుకోవాలి. దానికి చాలా వ్యయ ప్రయాసలు వుంటాయి.
కేఎల్ నారాయణ ప్రొడక్షన్ చేసి చాలా కాలం అయింది. అందుకే నిర్మాత దిల్ రాజును ఈ ప్రాజెక్టులో జాయిన్ చేస్తారని వినిపిస్తోంది. ఎలాగూ భవిష్యత్ లో ఆ సినిమా రైట్స్ కోసం వంద కోట్లకు పైగా దిల్ రాజు పెట్టుబడి పెట్టాలి. దానికి బదులు నిర్మాణంలో భాగస్వామి అయితే ఇంకా బెటర్.
ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్, విజయ్-వంశీపైడిపల్లి లాంటి క్రేజీ ప్రాజెక్టులు దిల్ రాజు చేతిలో వున్నాయి. ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్టులో భాగస్వామ్యం దొరికితే ఓ లెవెల్ లో వుంటుంది ఆయన బ్యానర్.