ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది సాధిస్తారు. ఆయన తలచుకుంటే జరిగి తీరుతుంది. ఆయన చూపు ఏనాడో విశాఖ మీద పడింది. హైదరాబాద్ తరువాత అంత పొటెన్షియాలిటీ కలిగిన విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఏపీకి మేలు జరుగుతుందని జగన్ తలపోసారు.
నిజానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్ విశాఖ మీద ఇలా ఆలోచనా చేయడానికి ఏపీ విసృత ప్రయోజనాలే తప్ప వేరేమీ లేదని తటస్థులు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా జరిగిన క్యాబినేట్ సమావేశంలో విశాఖను ఐటీ రాజధానిగా మార్చేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయమని అంటున్నారు. అదానీకి 130 ఎకరాలను కేటాయించడం ద్వారా ఒక్క దెబ్బకు పాతిక వేల పై చిలుకు ఉద్యోగాలను విశాఖకు వరంగా జగన్ ప్రసాదించారు.
అదానికి మధురరాడలో ఇచ్చిన 130 ఎకరాలల్లో డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లని ఏర్పాటు చేస్తారు. వీటి వల్ల ప్రత్యక్షంగానే పావు లక్ష మందికి జాబ్స్ వస్తాయంటే నిజంగా విశాఖ వాసులు అదృష్టం చేసుకున్నట్లే లేక్క.
ఆదానీ డేటా సెంటర్ ని విశాఖ నుంచి వైసీపీ సర్కార్ పంపించేసిందని టీడీపీ తమ్ముళ్ళు ఇప్పటిదాకా విమర్శలు చేస్తూ వచ్చారు. అది తప్పు అని జగన్ ప్రభుత్వం ఆచరణలో నిరూపించింది. అంతే కాదు, టూరిజం పరంగా కూడా విశాఖను నంబర్ వన్ చేయాలనుకుంటోంది. అవన్నీ మెటీరియలైజ్ అయితే విశాఖ మరో హైదరాబాద్ గా ఉపాధి కేంద్రంగా మారడం ఖాయం. మొత్తానికి జగన్ ఏలుబడిలో విశాఖకు కొత్త రూపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయని అంటున్నారు.