టిటిడి పుణ్యక్షేత్రమా …కాదు ఓ కార్పొరేషన్ …!

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల గొప్పదనం గురించి, దాని విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రంగా టీటీడీ గురించి చెప్పుకుంటారు. స్వామి మహిమల గురించి ఎంత…

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల గొప్పదనం గురించి, దాని విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రంగా టీటీడీ గురించి చెప్పుకుంటారు. స్వామి మహిమల గురించి ఎంత చెప్పుకున్నా చాలదంటారు. అలాగే టీటీడీలో అవినీతి గురించి, అందులో జరుగుతున్నా రాజకీయాల గురించి కూడా ఎంత చెప్పుకున్న చాలదు. శ్రీవారి గురించి చెప్పుకున్నా, టీటీడీ బోర్డులో అవినీతి, రాజకీయాల గురించి చెప్పుకున్నా అది ఒడవని ముచ్చటే అవుతుంది. 

తిరుమల గురించి చెప్పుకున్నప్పుడల్లా చెప్పుకునే మరో ముచ్చట అన్యమత ప్రచారం. బోర్డులో అన్యమతస్తులను సభ్యులుగా నియమించడం. అది కూడా క్రిస్టియన్ మతస్తులను మాత్రమే నియమించడం ఎప్పుడూ వివాదమే. తిరుమల విషయంలో టిక్కెట్ల నుంచి సేవల నుంచి వివాదం కానీ విషయమంటూ లేదు. ఇక ఈసారి టీటీడీ బోర్డుకు జంబో పాలకవర్గాన్ని నియమించడం కూడా  విమర్శలకు దారి తీసింది. టీటీడీ నవ్వులపాలైంది. ఇలాంటి పనులవల్ల తేదీ పుణ్యకేత్రం స్థాయి కోల్పోయి ఓ కార్పొరేషన్ స్థాయికి దిగజారిపోయింది.

టీటీడీ అంటే పుణ్యక్షేత్రం కాదు పునరావాస కేంద్రమనే అభిప్రాయం బలపడిపోయింది. అనేకమంది పాపాత్ములు టీటీడీ బోర్డులో సభ్యత్వం పొంది పుణ్యం మూగట్టుకుంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏర్పాటు చేసిన పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆయన రెండోదారి కూడా చైర్మన్ అయ్యాడు. రెండోసారి వైవీ సుబ్బారెడ్డికే టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ప్రభుత్వం.. పాలకమండలిలో మార్పులు చేసింది. 

ఐతే పాలకమండలిలో ఓ సభ్యునిపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఆయనే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ఆయన్ను టీటీడీ సభ్యుడిగా నియమించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన గురించి గూగుల్ లో సర్చ్ చేస్తే సిలువ మోస్తున్న ఫొటోలు రావడమే. క్రిస్టియన్ అయిన సంజీవయ్యకు ఎలా పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, ప్రశ్నిస్తున్నారు.

క్రిస్టియన్ ప్రభుత్వం కాబట్టే క్రిస్టియన్ ను టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా వేసి టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని విమర్శలు చేశారు. ఇక అధికార పార్టీ రెబెల్ ఎంపీ రంగురామ కృష్ణంరాజు సైతం సంజీవయ్య క్రిస్టియన్ అన్నాడు. ఈ  వివాదంపై స్పందించిన సంజీవయ్య తాను హిందువుగానే పుట్టానని…. హిందువుగానే చేస్తానని అన్నాడు.  

శిలువ మోస్తున్న తన ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంది పడ్డాడు. టీటీడీ బోర్డ్ మెంబర్ అయిన తనను  దొంగ దెబ్బ తీసేందుకె శిలువ మోసిన చిత్రాలు వైరల్ చేస్తున్నారని ఆరోపించాడు. తనపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని చెప్పాడు.

2017 లో శాసన సభ్యునిగా ఉన్నప్పుడు సూళ్లూరుపేటలో క్రిస్టియన్ సోదరుల కోరిక మేరకు శిలువను మోశానని చెప్పాడు. ఇప్పుడు టీటీడీ బోర్డ్ సభ్యుడిని కాబట్టి తనని ఎవరైనా శిలువ మోయాలని కోరితే సున్నితంగా తప్పుకుంటానని అన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదాలు జరిగాయి. 

అప్పట్లో  టీడీపీ ఎమ్మెల్యే అనితను పాలకమండలి సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. వెలగపూడి అనిత క్రిస్టియన్ అంటూ అన్యమతస్థులకు ఎలా పాలకమండలిలో చోటు కల్పిస్తారంటూ హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దింతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గి అనితను పాలకమండలి సభ్యుల జాబితా నుంచి తప్పించడంతో ఆ వివాదం సమసిపోయింది. 

టీడీపీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ అధ్యక్షుడిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  ఐతే ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఆయన క్రిస్టియన్ అంటూ ప్రచారం జరిగింది. తాను క్రిస్టియన్ కాదు మొర్రో సుధాకర్ యాదవ్ మొత్తుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్ల్స్ ఆగలేదు.  

ఇక గతంలో ఎన్నడూలేని విధంగా 80మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది. పాలకమండలిలో చోటు కోసం వందకు పైగా సిఫార్సులు వచ్చాయి. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్ కు చెందిన వారికి చోటు కల్పించారు.

ముందు  పాలకమండలిలో 24 మందికి చోటు కల్పించిన ప్రభుత్వం.. నలుగురు అధికారులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రకటించింది. దీంతో టీటీడీ బోర్డులో 28మందికి చోటిచ్చింది. మరోవైపు 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 80మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది. 

ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చాయి. సీఎం జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తల నుంచి సిఫార్సులు వచ్చాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు కావడమంటే మంత్రి పదవి పొందడం కంటే ఎక్కువ.