ష‌ణ్ముక్‌కి సిరి ముద్దు..బాయ్ ఫ్రెండ్ సీరియ‌స్‌!

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 కాస్త ప్రేమ‌, కొంచెం కోప‌తాపాలు, ఇత‌ర‌త్రా ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతోంది. అందులోనూ హౌస్‌లో అంతా యువ‌త వుండ‌డంతో భావోద్వేగాల‌ను దాచుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. అది కోప‌మైనా, ప్రేమైనా, ఏదైనా కావ‌చ్చు. ఈ క్ర‌మంలో…

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 కాస్త ప్రేమ‌, కొంచెం కోప‌తాపాలు, ఇత‌ర‌త్రా ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతోంది. అందులోనూ హౌస్‌లో అంతా యువ‌త వుండ‌డంతో భావోద్వేగాల‌ను దాచుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. అది కోప‌మైనా, ప్రేమైనా, ఏదైనా కావ‌చ్చు. ఈ క్ర‌మంలో కెప్టెన్సీ టాస్క్‌లో స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగింది. ఇది కోపానికి సంబంధించిన అంశం.

ష‌ణ్ముక్‌కి సిరి ముద్దు పెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంద‌ర్భంగా ష‌ణ్ముక్‌, సిరి మ‌ధ్య సాగిన ముచ్చ‌ట్లు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.  ‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం’ అని సిరికి షణ్నూ హిత‌బోధ చేస్తాడు. దీనికి ఆమె స్పందిస్తూ… నీ వల్లే మాన‌సికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని బదులిస్తుంది. చిరాకు అనిపిస్తే దూరం పెట్టు అని షణ్నూ మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టాడు.

ఆ త‌ర్వాత సిరిలో ఉన్న‌ట్టుండి మార్పు. అక‌స్మాత్తుగా ష‌ణ్ముక్‌కి ముద్దు పెట్టి అత‌నితో పాటు ప్రేక్ష‌కుల‌ని షాక్ గురి చేస్తుంది. కెమెరాల వైపు చూస్తూ ‘జాగ్రత్తగా రికార్డ్‌ చేశారా? నాకు ఉంటదిపుడు’ అని ష‌ణ్ముక్ కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ష‌ణ్ముక్‌కి సిరి ముద్దు పెట్టుకోవ‌డంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.   శ్రీహాన్‌తో అనే యువ‌కుడితో సిరి రిలేషన్‌లో ఉంటూ…హౌస్‌లో మ‌రొక ల‌వ్ ట్రాక్ న‌డ‌ప‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ ఉదంతంపై సిరి బాయ్‌ఫ్రెండ్ ఫైర్ అయ్యారు. కానీ త‌న ప్రేయ‌సిపై సిరిపై ఆగ్ర‌హంగా ఉన్నార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. త‌న ప్రేయ‌సి ముద్దు పెట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టిన వాళ్ల‌పై శ్రీ‌హాన్ మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా సిరికి మ‌ద్ద‌తుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో ఏంట్రా అంటూ నెటిజ‌న్ల‌పై ఇన్‌స్టాస్టోరీలో ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌డాన్ని చూడొచ్చు.

‘ఇప్పుడేంట్రా నేనే ఏడవాలా? షార్ట్‌ ఫిల్మ్స్‌, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు’ అంటూ  నెటిజన్ల ట్రోల్స్‌పై శ్రీ‌హాన్ అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు. బాయ్ ఫ్రెండ్‌కు లేని ఇబ్బంది ఇత‌రుల‌కు ఏంటో అని శ్రీ‌హాన్ పోస్ట్‌పై కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.