చైతూ కూడా మూడు గెటప్ లు

ఈ మధ్య హీరోలకు ఈ గెటప్ ల వ్యవహారం బాగా పట్టుకుంది. ఒకే సినిమాలో రెండు మూడు షేడ్ లు, రెండు మూడు గెటప్ లు అన్నది బాగా కామన్ అయిపోయింది. త్వరలో చైతూ-విక్రమ్…

ఈ మధ్య హీరోలకు ఈ గెటప్ ల వ్యవహారం బాగా పట్టుకుంది. ఒకే సినిమాలో రెండు మూడు షేడ్ లు, రెండు మూడు గెటప్ లు అన్నది బాగా కామన్ అయిపోయింది. త్వరలో చైతూ-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో చేయబొతే థాంక్యూ సినిమాలో కూడా ఈ గెటప్ ల వ్యవహారం వుందట.

ఈ సినిమాలో చైతూ మూడు షేడ్స్ లో కనిపిస్తాడు. అలాగే ఆ షేడ్స్ కు తగట్టు చిన్న చిన్న ఛేంజెస్ తో మూడు గెటప్స్ లో కనిపిస్తాడు. ఈ మధ్యనే విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ ఫైనల్ నేరేషన్ ఇచ్చి చైతూ చేత ఓకె అనిపించుకున్నాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ చేస్తున్న చైతూ తన తరువాత ప్రాజెక్టుగా విక్రమ్ కుమార్ సినిమాను ఫైనల్ చేసాడు. ఆ తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రాజెక్టు వుంటుంది. అది కూడా లవ్ స్టోరీనే.  ఈ రెండు లవ్ స్టోరీల మధ్యలో ఓ డిఫరెంట్ సినిమాగా విక్రమ్ కే కుమార్ సినిమా చేయబోతున్నాడు చైతూ.