చంద్రబాబునాయుడుకు పట్టుదల ఎక్కువ. ఏ విషయాల్లో అంటే తాను నమ్మిన విషయాల్లో, తనకు నచ్చిన విషయాల్లో, ఇపుడు అలాంటిదే అమరావతి. అది చంద్రబాబుకు కలల రాజధాని. ఎంతలా అంటే పగలు కూడ పలవరించేంతలా.
సరే ఆయనకు అమరావతి స్వర్గధామం అనుకున్నా అయిదేళ్ల కాలంలో జనం కూడా అలా అనుకునేలా చేయలేకపోవడమే ఇక్కడ విషాదం. ప్రజలు మానసికంగా అమరావతి రాజధానికి కనెక్ట్ కాలేదు. అది నిరూపించాయి 2019 సార్వత్రిక ఎన్నికలు.
ఏకంగా రాజధాని ప్రాంతంలోనే టీడీపీ భావివారసుడు ఓడిపోయాడు అంటేనే జనం ఎంతలా అమరావతి గురించి అర్ధం చేసుకున్నదీ బోధపడుతోంది. కానీ బాబుకు మాత్రం ఇంకా ఏదో నమ్మకం. పదమూడు జిల్లల వారికీ అమరావతి రాజధాని అని తనలాగే మా చెడ్డ ఫీలింగ్ ఉందని బలమైన అత్యాశ.
తమ్ముళ్లూ అమరావతే మన రాజధాని అని జనంలోకి వెళ్ళి చాటి చెప్పండి అంటే అటు రాయలసీమ తమ్ముళ్లు కానీ, ఇటు విశాఖ నేతలు కానీ కిమ్మనడంలేదుట. దాంతో వాళ్లతో ఇక కుదరదు అని బాబే స్వయంగా విశాఖకు రావాలనుకుంటున్నారుట.
విశాఖ జనం చేత ఆయనే మాకు పాలనారాధాని వద్దు, అమరావతి ముద్దు అనిపించాలనుకుంటున్నట్లుగా ఉంది. ఆరు నెలల క్రితం ఇదే బాబు విశాఖ వస్తే ఎయిర్ పోర్టు నుంచే అటునుంచి అలా పోలీసులు పంపేశారు. బాబు గో బ్యాక్ అని ప్రజాసంఘాలు నినదించాయి. కానీ అదంతా వైసీపీ కుట్ర అని నమ్ముతున్న బాబు విశాఖ నడి బొడ్డు నుంచే జై అమరావతి అనిపించాలని ఆరాటపడుతున్నారుట. మరి బాబు విశాఖ టూర్ త్వరలో అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.