భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

వివాహేతర సంబంధాలు మర్డర్లకు దారితీస్తున్న ఘటనలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలాంటిదే మరో ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగింది. భర్తను చంపేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టింది భార్య. తర్వాత ప్రియుడితో కలిసి మరో…

వివాహేతర సంబంధాలు మర్డర్లకు దారితీస్తున్న ఘటనలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలాంటిదే మరో ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగింది. భర్తను చంపేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టింది భార్య. తర్వాత ప్రియుడితో కలిసి మరో ఊరికి వెళ్లి సహజీవనం స్టార్ట్ చేసింది. ఊహించని ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

చిరంజీవి అనే వ్యక్తికి కొల్లూరులో మెడికల్ షాప్ ఉంది. అదే ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో అతడికి స్నేహం కుదిరింది. చెరుకుపల్లిలోని చిరంజీవి ఇంటికి వస్తుండేవాడు స్నేహితుడు. ఈ క్రమంలో చిరంజీవి స్నేహితుడికి, అతడి భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

కొన్ని రోజుల కిందట చిరంజీవి ఓ స్థలాన్ని అమ్మగా 20 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోనే ఉంచాడు. విషయం తెలుసుకున్న భార్య, తన ప్రియుడు (చిరంజీవి స్నేహితుడు)తో కలిసి భర్తను హత్య చేసింది. అక్కడితో ఆగకుండా అదే ఇంట్లో అతడ్ని పూడ్చిపెట్టింది. తర్వాత ఇంట్లో ఉన్న 20 లక్షలు తీసుకొని ప్రియుడితో కలిసి కొల్లూరు వెళ్లిపోయింది. అక్కడే అతడితో సహజీవనం ప్రారంభించింది.

3 నెలలుగా కొడుకు టచ్ లోకి రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. కేసు నమోదు చేసుకున్న రేపల్లె పోలీసులు భార్యను తమదైన స్టయిల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది.

కట్టుకున్న భర్తనే చంపేసి, ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటన రేపల్లె పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది.

హైద్రాబాదులో నీ ఘనకార్యాలు అవేనా

ఆర్‌కే రాత‌ల‌కు అర్థాలే వేరులే