అందాల ఆరబోత ఓకే.. అవకాశాలెక్కడ?

“కాలంతో పాటు మారాలి. ఇంకా మడికట్టుకొని కూర్చుంటానంటే, కొన్ని రోజులకు నాకు వదిన, అక్క పాత్రలే వస్తాయి. హీరోయిన్ పాత్రలు రావు. అందుకే గ్లామరస్ గా కనిపిస్తున్నాను. హాట్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.” కొన్ని…

“కాలంతో పాటు మారాలి. ఇంకా మడికట్టుకొని కూర్చుంటానంటే, కొన్ని రోజులకు నాకు వదిన, అక్క పాత్రలే వస్తాయి. హీరోయిన్ పాత్రలు రావు. అందుకే గ్లామరస్ గా కనిపిస్తున్నాను. హాట్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.” కొన్ని రోజుల కిందట తమన్నా ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.

ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ కరెక్ట్. కుర్ర హీరోయిన్లతో సమానంగా పోటీలో నిలవాలంటే తమన్న లాంటి సీనియర్లు గ్లామర్ గా కనిపించాల్సిందే. ఆమె కూడా అదే చేసింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అందాల విందు అందిస్తోంది. తమన్నలో ఈ కోణం కూడా ఉందా అనే రేంజ్ లో ఫొటోషూట్స్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ తమన్న తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఏ మేరకు కలిసొచ్చింది? ఈ గ్లామర్ డోస్ ఆమెకు మరిన్ని అవకాశాలు అందించిందా అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం.

తనలో ఇంకా గ్లామర్ తగ్గలేదని, ఇప్పటికీ అదే వేడి-ఊపు ఉన్నాయని మిల్కీబ్యూటీ తన ఫొటోషూట్స్ తో చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇండస్ట్రీ జనాలు మాత్రం ఆమెను అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో తమన్నకు అవకాశాలు రావడం లేదు.

ఈ ఏడాది భోళాశంకర్ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ మాత్రమే చేసింది తమన్న. మధ్యలో జైలర్ సినిమాలో కనిపించినా అది అతిథి పాత్ర. వచ్చే ఏడాది ఈమె చేతిలో ఓ తమిళ, ఓ హిందీ సినిమా మాత్రమే ఉన్నాయి. తెలుగు నుంచి ఆమెకు కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు.

మరోవైపు తమన్న పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, వచ్చే ఏడాది అతడ్ని పెళ్లి చేసుకోబోతోందంట. అవకాశాలు వస్తే పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించడానికి ఆమె రెడీ.