ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) అనంతలోకాలకు వెళ్లిపోయారు. గత కొంత కాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఇటీవల అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. ఇంతలోనే చేదు సమాచారం. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.
ఆమె ఇక లేరనే సమాచారాన్ని స్వయంగా ప్రధానే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గురువారం అర్ధరాత్రి ప్రధాని మాతృమూర్తి శాశ్వత నిద్రలోకి వెళ్లారు. తన తల్లి మృతిపై ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్టు పెట్టారు.
నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని మా అమ్మ భగవాన్ ఈశ్వరుడి పాదాల చెంతకు చేరుకున్నారు. మాతృ మూర్తి జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిదని ప్రధాని ట్వీట్ చేశారు. ఇదిలా వుండగా ప్రధాని మాతృమూర్తి మరణంపై రాజకీయాలకు అతీతంగా సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి.