హీరోలు దొరకట్లేదు

తెలుగు సినిమా దర్శకులను హీరోల కొరత పీడిస్తోంది. ఇదివరకు హిట్ సినిమా తీస్తే వెంటనే పలువురు హీరోలు క్యూ కట్టేవాళ్లు. ఇప్పుడు సూపర్‌స్టార్స్ మాట అటుంచి కనీసం మధ్య శ్రేణి హీరోలు కూడా అందుబాటులో…

తెలుగు సినిమా దర్శకులను హీరోల కొరత పీడిస్తోంది. ఇదివరకు హిట్ సినిమా తీస్తే వెంటనే పలువురు హీరోలు క్యూ కట్టేవాళ్లు. ఇప్పుడు సూపర్‌స్టార్స్ మాట అటుంచి కనీసం మధ్య శ్రేణి హీరోలు కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చేసింది. దీంతో సెక్సస్‌ఫుల్ డైరెక్టర్స్ కూడా హీరోల కోసం వెతుక్కోవాల్సిన సిట్యువేషన్ వుంది.

వరుస హిట్స్ ఇస్తోన్న అనిల్ రావిపూడి మలి చిత్రానికి ఇంకా హీరో ఫిక్స్ అవలేదు. ‘ప్రతిరోజూ పండగే’తో హిట్ కొట్టిన మారుతి కూడా తదుపరి చిత్రంలో హీరో కోసం చూస్తున్నాడు. ఇక ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా అయితే ‘కబీర్ సింగ్’ తర్వాత ముంబయి నుంచి హైదరాబాద్ వరకు పలువురు హీరోలని సంప్రదించినా ఫలితం లేదు.

‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి కూడా తన కథ పట్టుకుని పలువురి హీరోల చుట్టూ తిరిగేసాడు. ఇంకా ఆ ప్రాజెక్ట్ కాంక్రీట్‌గా ముందుకు వెళ్లలేదు. సురేందర్ కూడా స్టార్ హీరోలు లేక అఖిల్‌తో సినిమా చేయాలని చూస్తున్నాడు. సెక్సస్‌ఫుల్ డైరెక్టర్లు, పేరున్న దర్శకుల సంగతే ఇలావుంటే ఇక ఫ్లాప్ ఇస్తే అంతే సంగతులు. 

ఇదీ జగన్ విజన్

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే