కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న ట్రయిలర్ ఇది. ఇటు పరిశ్రమను అటు పొలిటీషియన్స్ ను కదిలిస్తోంది ఈ సినిమా ట్రయిలర్. ఏపీ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ.
అవును.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రయిలర్ లో బాలయ్య లేడు. చివరికి కేఏ పాల్, బ్రాహ్మణి, దేవాన్ష్ లకు కూడా చోటు కల్పించిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్యను మాత్రం చూపించలేదు. ట్రయిలర్ లో క్యారెక్టర్లతో పాటు.. ట్రయిలర్ లో లేని బాలయ్య పాత్రపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ మొదలైంది.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలయ్య ఉన్నాడు. కాకపోతే ట్రయిలర్ లో లేడంతే. మరో ప్రత్యేకమైన అకేషన్ లో కేవలం బాలయ్యను ఫోకస్ చేస్తూ చిన్న వీడియో టీజర్ రిలీజ్ చేస్తారట. అంటే.. బాలయ్యకు ఆర్జీవీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాడట. అంతేకాదు.. గతంలో బాలయ్య చెప్పగా “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” అనే డైలాగ్ ను కూడా బాలయ్య పాత్రతో చెప్పించాడట వర్మ.
ట్రయిలర్ లో దాదాపు పాత్రలన్నింటినీ పరిచయం చేసిన వర్మ.. ఇకపై ఒక్కో పాత్రకు సంబంధించి ఒక్కో క్లిప్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో భాగంగా చంద్రబాబు, జగన్, పవన్, కేఏ పాల్ పాత్రలతో పాటు బాలయ్య పాత్రకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ క్లిప్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నాడు ఆర్జీవీ.
చూస్తుంటే.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో మరిన్ని సంచలనాలు ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సినిమా సంగతి పక్కనపెడితే.. అలాంటి సంచలనాలన్నింటినీ ఒక్కొక్కటిగా విడుదలకు ముందే ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు వర్మ.