చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం.. హైకోర్టులో బంతి

మరో 2 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సకల జనుల సమ్మె రాబోతోంది. ఇటు చూస్తే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుపై మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు హైకోర్టులో ఈ సమస్యకు సంబంధించి…

మరో 2 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సకల జనుల సమ్మె రాబోతోంది. ఇటు చూస్తే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుపై మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు హైకోర్టులో ఈ సమస్యకు సంబంధించి ఓ పరిష్కార మార్గం లభించవచ్చని అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాల మేరక చర్చలు ప్రారంభించింది ప్రభుత్వం. కానీ మనస్ఫూర్తిగా ఆ చర్చలు ప్రారంభించినట్టు లేదనే విషయం శనివారం నాటి చర్చల్లోనే అర్థమైంది. కేవలం 21 అంశాలపై మాత్రమే చర్చిస్తామని అధికారులు చెప్పడం, కార్మిక నాయకుల్ని నిర్బంధ వాతావరణంలో పెట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. శనివారం నాటి చర్చల సారాంశాన్ని ఈరోజు ఇరువర్గాలు కోర్టుకు వెళ్లడించబోతున్నాయి. కోర్టు ఏం చెబుతుందో చూడాలి.

చర్చలకు సంబంధించి ఆదివారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం నాటి చర్చలు ఎలా సాగాయనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం కోర్టులో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై కూడా కసరత్తు చేశారు. అటు కార్మిక సంఘాలు కూడా కోర్టులో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది.

మరోవైపు కార్మిక సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 45 డిమాండ్లపై చర్చలకు సిద్ధం అంటూ ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. సరిగ్గా కోర్టు మెట్లు ఎక్కేముందు కార్మిక సంఘాలు రాసిన ఈ లేఖ వ్యూహాత్మకంగా జరిగింది. ఓవైపు ఇన్ని వ్యవహారాలు సాగుతున్నప్పటికీ మరోవైపు సమ్మెను మాత్రం ఆపలేదు కార్మిక సంఘాలు.

30న జరగనున్న సకల జనుల సమ్మెకు పూర్తిస్థాయిలో సిద్ధమౌతున్న ఆర్టీసీ కార్మికులు.. ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించారు. ఈ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. 

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు