భర్తతో విడిపోయిన తర్వాత వయసులో తన కన్నా చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనంతో వార్తల్లో నిలుస్తోంది మలైకా అరోరా. ఈమె సినిమా వర్క్ పెద్దగా చెప్పుకునేంత ఏమీ లేదు. అర్జున్ కపూర్- మలైకా జంటగా కనిపించడమే పెద్ద వార్తగా కొనసాగుతోంది బాలీవుడ్ మీడియాకు. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, యోగా పోజులు, జిమ్ బయట వాక్.. ఇవే మలైకాను వార్తల్లో నిలుపుతున్నవి. వీటికి తోడు వీరిద్దరూ విడిపోయారనే రూమర్లు అప్పుడప్పుడు వార్తలుగా మారుతూ ఉంటాయి.
ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి రూమర్లు వచ్చినా.. ఇటీవల అవి మరి కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. మలైకాకు అర్జున్ గుడ్ బై చెప్పేశాడని, మరో మగువతో అతడు డేటింగ్ కూడా మొదలుపెట్టాడనే రూమర్లు వినిపిస్తున్నాయి కొన్ని రోజులు. ఆమె పేరు కుషా కపిల అట. సినిమాలకు సంబంధించిన వ్యక్తే. ఆమెతో అర్జున్ కపూర్ ప్రేమలో పడ్డాడని, మలైకాకు దూరం అవుతున్నాడనే టాక్ నడుస్తోంది. అర్జున్- మలైకా విడిపోయారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతూ ఉంది.
అయితే ఇది వరకూ పలు సార్లు ఇలాంటి రూమర్లకు తెరదించిన ఈ జంట మరోసారి అదే పని చేసింది. ఆదివారం రోజున డిన్నర్ డేట్ తో మీడియాకు కనిపించి, తాము విడిపోలేదనే విషయాన్ని చాటి చెప్పుకుంది ఈ జంట. తమ బంధం కొనసాగుతోందని ఇలా క్లారిటీ ఇచ్చారు. అయితే లోలోన మాత్రం ఏదో జరుగుతోందనే టాక్ ఇంకా కొనసాగుతూ ఉంది.
మొన్నటి వరకూ కుషా కపిలను మలైకా ఇన్ స్టాలో ఫాలో అవుతూ ఉందట. ఇప్పుడు ఆమెను ఈమె అన్ ఫాలో కొట్టిందని, కుషా అంటే మలైకాకు అసలు పడటం లేదని కథనాలు వస్తున్నాయి. మలైకాను అర్జున్ మోసం చేస్తున్నాడని, కుషాతో గడుపుతూ మలైకాకు కోపం తెప్పిస్తున్నాడని, అతడిని ఏం చేయలేక మలైకా కుషా పై మండిపడుతోందనేది టాక్!