కీర్తి సురేష్ లో మంచి నటి దాగుందని మొదటి సినిమా నుంచి ప్రూవ్ అవుతూనే వుంది. మహానటి సినిమాతో అది పీక్ కు వెళ్లింది. దాంతో మాంచి కథలు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. లండన్ లో పచ్చళ్ల వ్యాపారం చేసి, దటీజ్ మిస్ ఇండియా అనిపించుకునే పాత్రతో మిస్ ఇండియా సినిమా రెడీ అవుతోంది.
అలాగే నగేష్ కుకునూరు డైరక్షన్ లో గుడ్ లక్ సఖీ సినిమా తయారవుతోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఇప్పుడు సినిమా కాన్సెప్ట్ ఏమిటన్నది క్లారిటీ వచ్చింది. ఓ తండా అమ్మాయి, అందరూ బ్యాడ్ లక్ వెంట పెట్టుకుని తిరుగుతుంది అనుకునే అమ్మాయి, ఓ ఛాంపియన్ షూటర్ గా ఎదిగిన వైనం సినిమాగా మలిచినట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది.
అమాయకపు అమ్మాయిగా, మాంచి ఆత్మవిశ్వాసం గల క్రీడాకారిణిగా హావభావాలు పండించడంలో కీర్తి సురేష్ శహభాష్ అనిపించుకుంది. టీజర్ చివర్న ఆమె అలా నడుచుకుంటూ వెళ్లిపొతున్నపుడు ప్రదర్శించిర హావభావాలు ఆమెలోని మంచి నటిని మరోసారి పరిచయం చేస్తాయి.