జెండా ఎత్తేయనున్న టీడీపీ తమ్ముళ్ళు?

తెలుగుదేశం పార్టీకి రోజులు బాగాలేవులా ఉంది. ఓ వైపు అమరావతి కోసం  పార్టీని ఫణంగా పెట్టి మరీ అధినేత చంద్రబాబు రాజకీయ జూదానికి దిగిపోయారు. ఒక్క రాజధాని ఉండాలి, అది కూడా అమరావతి మాత్రమేనని…

తెలుగుదేశం పార్టీకి రోజులు బాగాలేవులా ఉంది. ఓ వైపు అమరావతి కోసం  పార్టీని ఫణంగా పెట్టి మరీ అధినేత చంద్రబాబు రాజకీయ జూదానికి దిగిపోయారు. ఒక్క రాజధాని ఉండాలి, అది కూడా అమరావతి మాత్రమేనని చంద్రబాబు గట్టి పట్టుదలగా ఉన్నారు.

అదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన తమ్ముళ్ళ  మనోభావాలను ఆయన అసలు పట్టించుకోవడంలేదు. దాంతో తమ్ముళ్ళు కూడా ఎవరి దోవ వారు చూసుకోవాలనుకుంటున్నారు. అసలే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాల్లో టీడీపీ ఆరంటే ఆరు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. దిగ్గజ నేతలంతా ఓటమి పాలు అయ్యారు. భవిష్యత్తు ఎవరికీ అసలు ‌అర్ధం కాని స్థితి.

దీనికి తోడు విశాఖ రాజధానిని టీడీపీ అధినాయకుడే వ్యతిరేకించడంతో ఇక పార్టీలో ఉండి లాభమేంటన్న చర్చ తమ్ముళ్లలో జోరుగా సాగుతోందిట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు అయితే టీడీపీ జెండాను పక్కన పెట్టి మరీ వైసీపీలోకి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఆయన విశాఖ రాజధానికి బాహాటంగానే మద్దతు ప్రకటించిన సంగతి విధితమే. మంచి ముహూర్తం చూసుకుని వైసీపీ జెండా కప్పుకోవడానికి కోండ్రు రెడీ అయ్యారన్నది  సమాచారం. ఆయన బాటలోనే మరికొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వస్తారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఏది ఏమైనా విశాఖ రాజధాని కాదు కానీ టీడీపీ రాజకీయాన్ని టోటల్ గా  అతలాకుతలం చేస్తోందని అంటున్నారు.

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఈనాడు పాలిష్డ్, జ్యోతి బరితెగింపు