'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్‌లో బిజీగా వున్న మహేష్ తదుపరి చిత్రంపై ఇంతవరకు నిర్ణయానికి రాలేదు. వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినా కానీ దానికి ఇంకా సబ్జెక్ట్ రెడీ కాలేదు.
ఇటీవల కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ని కలిసినా కానీ ఆ చిత్రంపై ఇంతవరకు క్లారిటీ లేదు. మహేష్‌తో ఇంతకుముందు అనుకున్న సందీప్ వంగా, పరశురామ్, త్రివిక్రమ్ సినిమాలేవీ మెటీరియలైజ్ అవలేదు.
ఏదో ఒక చిత్రాన్ని హడావిడిగా మొదలు పెట్టడం కంటే కాస్త తీరికగానే స్టోరీ లాక్ చేద్దామని మహేష్ భావిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత మహేష్ గ్యాప్ తీసుకుంటాడు.
తదుపరి చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్‌కి రిలీజ్ అయ్యేలా చూసుకోవచ్చు కనుక మహేష్ చేతిలో చాలా టైమ్ వుంటుంది. అగ్ర హీరోల మార్కెట్ వంద కోట్లు దాటిపోవడంతో కథల విషయంలో అజాగ్రత్త పనికి రాదని అందరూ గ్రహించారు.
అందుకే ఇంతకుముందులా కేవలం దర్శకులని నమ్మి కథపై అనుమానాలున్నా చేసేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చాలా హిట్స్ ఇచ్చిన టాప్ డైరెక్టర్స్ కూడా స్టోరీపై అమితమైన కసరత్తు చేయక తప్పట్లేదు.