హీరో కార్తి కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తయారైన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ అందించారు. ఈవారం విడుదలైన ఈ సినిమాకు మాంచి టాక్ వచ్చిన సందర్భంగా నిర్మాత రాధా మోహన్ మీడియాతో ముచ్చటించారు.
''దీపావళి శుభసందర్భంగా రిలీజైన మా 'ఖైదీ' చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమాని యాక్సెప్ట్ చేసి ఎంతో నమ్మకంగా చేసిన హీరో కార్తి కి, అలాగే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రకాష్‌బాబు, ప్రభు, వివేక్‌లకు కృతజ్ఞతలు. ఒక సినిమా సక్సెస్ అయ్యి, మంచి రేటింగ్‌తో పాటు మంచి మౌత్ టాక్ ఉంటే ఆ సంతోషమే వేరు. ప్రేక్షకులు మాకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్ 'ఖైదీ'.
ఈ సినిమాలో హీరోయిన్, పాటలు లేకపోయినా రెండు గంటల ఇరవై నిమిషాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ని అభినందిస్తున్నాను. తనకి ఇది రెండో సినిమా. ఫస్ట్ సినిమా 'నగరం' కూడా రాత్రి నేపథ్యంలోనే ఉంటుంది. మంచి హిట్ అయ్యింది. ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే కథ అయినా చిత్రాన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించారు.
'ఖైదీ' సినిమాకి రివ్యూస్ చాలా గొప్పగా వచ్చాయి. ఈరోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకులు మాకు ఇచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ 'ఖైదీ' అని అన్నారు రాధామోహన్.
అలాగే మా బేనర్లో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా' షూటింగ్ 50 పర్సెంట్ పూర్తయింది. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేస్తాం అని రాధామోహన్ తెలిపారు.